Shruti Marathe | ‘దేవర’లో ఎన్టీఆర్ భార్యగా కనిపించిన ఈమె వయస్సు ఎంతో తెలుసా..?

దేవర రెండు రోజుల కలెక్షన్స్?

Shruti Marathe | నిజానికి దేవరకి వచ్చిన పబ్లిక్ టాక్ కి ఈస్థాయి కలెక్షన్స్ ఎవరూ ఊహించలేదు. కానీ.. ఎన్టీఆర్ స్టార్ డం, సినిమాకి ఉన్న ప్రీరిలీజ్ బజ్ కారణంగా ఫస్ట్ వీకెండ్ భారీ కలెక్షన్స్ సొంతం చేసుకుంది. పాపం “ఆచార్య”తో (Acharya) బోలెడంత చెడ్డ పేరు మూటగట్టుకున్న కొరటాల శివ (Koratala Siva) “దేవర” రిజల్ట్ తో ఊపిరి పీల్చుకున్నాడు. నిజానికి దేవరతొలి రోజు నైజాలో రూ. 6.94 కోట్లు, సీడెడ్‌లో రూ. 3.77 కోట్లు, వైజాగ్‌లో రూ. 1.68 కోట్లు, తూర్పు గోదావరి జిల్లాలో రూ. 0.86 కోట్లు, పశ్చిమ గోదావరిలో రూ. 0.48 కోట్లు, కృష్ణాలో రూ. 0.95 కోట్లు, గుంటూరులో రూ. 0.82 కోట్లు, నెల్లూరులో రూ. 0.62 కోట్లు వసూలు చేసింది.

రెండు రోజుల మొత్తం కలెక్షన్స్ చూస్తే, తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 70.33 కోట్ల వరకు షేర్ రాబట్టింది. శనివారంతో పోల్చితే ఆదివారం కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. సెలవుదినం కావడంతో పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు థియేటర్స్‌కు వచ్చే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా ‘దేవర’ రెండు రోజుల్లో 250 నుండి 300 కోట్ల మధ్యలో వసూళ్లు చేయవచ్చని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.మరో పక్క దేవర సినిమా ప్రపంచవ్యాప్తంగా ఆల్మోస్ట్ 180 కోట్లకు పైగా థియేట్రికల్ బిజినెస్ చేసింది. బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే కనీసం 360 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేయాలి.

Shruti Marathe

దేవర’లో ఎన్టీఆర్ భార్య..


సెలవులు, దేవర కలెక్షన్స్ చూస్తుంటే ఈజీగా 500 కోట్ల గ్రాస్ వసూలు చేస్తుందని భావిస్తున్నారు.ప్రస్తుతానికి “దేవర” క్రియేట్ చేసిన రికార్డులను మాత్రం ఎన్టీఆర్ ఫ్యాన్స్ & డిస్ట్రిబ్యూటర్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం డిస్ట్రిబ్యూషన్ హక్కులు అవుట్ రైట్ గా సొంతం చేసుకున్న సితార సంస్థ మరియు నాగవంశీ కూడా కలెక్షన్స్ తో ఫుల్ హ్యాపీ అని తెలుస్తోంది.అయితే బాక్సాఫీస్ వద్ద సినిమా పాజిటివ్ టాక్ వచ్చింది. దీనిపై స్పందించిన తారక్. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న రోజు మొత్తనికి వచ్చిసిందని తెలిపారు. ఫ్యాన్స్ అపరూపమైన స్పందనలతో సంతోషంగా ఉందని ట్వీట్ చేశారు.

డైరెక్టర్ కొరటాల శివ, నిర్మాతలకు డీఓపీకి ధన్యవాదాలు తెలిపారు. తారక్ హీరోగా నటించిన దేవర చిత్రం నేడు ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది. అర్ధరాత్రి ఒంటి గంట నుంచే ప్రీమియర్ షోలు పడిపోయాయి. దీంతో దేవర సినిమా చూసిన ఎన్టీఆర్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.మరో పక్క “దేవర” లో ఎన్టీఆర్ కి జోడిగా కనిపించిన నటి శృతి మరాఠేనే..కాగా ఈమె దేవర సినిమాలో దేవర రోల్ కి భార్యగా నటించింది. మెయిన్ హీరోయిన్ బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ అయినప్పటికీ ఈమె కోసం కూడా చాలా మంది మాట్లాడుకున్నారు. శృతిది గుజరాత్. పలు హిందీ, మరాఠి సినిమాలు, సిరీస్, సీరియళ్లలో సపోర్టింగ్ రోల్స్ చాలా చేసింది.

ఈమె గౌరవ్ ఘటనేకర్ అనే నటుడిని 2016 లో పెళ్లి చేసుకుంది. ఇప్పుడు దేవర సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇవ్వబోతుంది శృతి మరాఠి. దేవర సినిమాలో ఎన్టీఆర్ చేసే తండ్రి పాత్రకు భార్యగా నటించింది. దీంతో రెండు లుక్స్ లో కనిపించింది. యంగ్ పాత్రలో, ముసలి పాత్రలో శృతి మరాఠీ దేవరలో కనిపించి అధరకొట్టింది. అలాగే ఈమె గురించి కొరటాల మాట్లాడుతూ దేవర భార్య పాత్రకు ఒక ఫ్రెష్ ఫేస్, ఎక్కువ అంచనాలు లేని నటిని తీసుకోవాలనుకున్నాం అందుకే శృతి మరాఠిని తీసుకున్నాం అని తెలిపారు.శృతి కూడా దేవరలో చేస్తుంన్నందుకు చాలా సంతోషంగా ఉంది. రెగ్యులర్ గా ఈ సినిమా గురించి ఏదో ఒక పోస్ట్ పెడుతూనే ఉంటుంది. ఇటీవల కొన్ని రోజుల క్రితం దేవరలోని తన యంగ్, ముసలి లుక్స్ తో దిగిన సెల్ఫీలు కొన్ని పోస్ట్ చేసింది. ఈ సినిమా తర్వాత శృతి మరాఠీకి తెలుగులో మరిన్ని అవకాశాలు వచ్చే అవకాశం ఉండొచ్చు.

దేవర 11 రోజుల కలెక్షన్స్

సాలీడ్ కలెక్షన్స్‌తో దుమ్మలేపుతున్నాడు జూనియర్ ఎన్టీఆర్. మిక్స్‌డ్ టాక్ వచ్చినా ఏ మాత్రం డిజప్పాయింట్ చేయకుండా.. ట్రేడ్ వర్గాలే ఆశ్చర్యపోయేలా వసూళ్లు రాబడుతోంది దేవర. మొదటి వారంలోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను ఛేదించిన ఎన్టీఆర్.. సెకండ్ వీక్ లాభాలను పంచి పెడుతున్నాడు.11 రోజుల్లో ‘దేవర’ మూవీ నైజాంలో 47.54 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. ఇప్పటికి థియేటర్స్ లో సినిమాకి డీసెంట్ కలెక్షన్స్ వస్తున్నాయి. ఇదే జోరులో దసరా వరకు మూవీ కొనసాగితే 50 కోట్ల షేర్ క్రాస్ చేయడంతో పాటు లాభాల్లోకి వెళ్లడం గ్యారెంటీ అని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

11వ రోజు ఈ చిత్రానికి నైజాంలో 73 లక్షలు షేర్ వచ్చింది. మరల ఈ కలెక్షన్స్ దసరా ఫెస్టివల్ టైంలో పెరుగుతాయని భావిస్తున్నారు.’దేవర’ సినిమాకి క్రిటిక్స్ నుంచి మిశ్రమ రివ్యూలు వచ్చిన కూడా ప్రేక్షకులు కూడా బాగా ఆదరిస్తున్నారని ఈ కలెక్షన్స్ బట్టి స్పష్టం అవుతోంది.అలాగే లాంగ్ రన్ లో 600 కోట్ల వరకు ఈ మూవీ వసూళ్లు చేసే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ‘దేవర’ మూవీ కమర్షియల్ సక్సెస్ దిశగా అడుగులు వేయడంతో ‘దేవర పార్ట్ 2’ పైన అంచనాలు పెరగడం గ్యారెంటీ అని సినీ విశ్లేషకులు అంటున్నారు. అయితే కొరటాల శివ వీలైనంత వేగంగా ‘దేవర పార్ట్ 2’ ని ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలని విశ్లేషకులు చెబుతున్నారు.

దేవర ఓటీటీ స్ట్రీమింగ్ పై ఒక ఆసక్తికర వార్త నెట్టంట చక్కర్లు కొడుతోంది. దేవర డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను ప్రముఖ దిగ్గజ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసిందని సమాచారం. ఇందుకోసం రూ. 150 కోట్లు చెల్లించిందని టాక్. అలాగే థియేట్రికల్ రిలీజ్ అయిన 50 రోజుల తర్వాతే దేవర ఓటీటీ స్ట్రీమింగ్ చేయాలని నెట్‌ఫ్లిక్స్‌తో మేకర్స్ డీల్ కుదుర్చుకున్నట్లు టాక్ నడుస్తోంది.

ఈ నేపథ్యంలో దీపావళి కానుకగా దేవరను స్ట్రీమింగ్ చేసే అవకాశాలున్నాయని సామాజిక మాధ్యమాల్లో టాక్ నడుస్తోంది. లేకపోతే నవంబర్ రెండో వారం అంటే 15వ తేదీ నుంచి ఎన్టీఆర్ సినిమాను ఓటీటీ స్ట్రీమింగ్ చేసే అవకాశముందని తెలుస్తోంది. ప్రస్తుతం థియేటర్లలో దేవర దుమ్ము రేపుతోంది కాబట్టి ఇప్పట్లో దేవర ఓటీటీలోకి వచ్చే సూచనలేవీ కనిపించడం లేదు. కాగా ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధా ఆర్ట్స్ బ్యానర్స్ సంయుక్తంగా భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా దేవర సినిమాను నిర్మించాయి.

దేవర-2కు ముహూర్తం

‘దేవర’ రిలీజ్ ముందు వరకు ‘దేవర-2’ ఎప్పుడు చేయాలనే విషయంలో టీంకు కూడా స్పష్టత లేదు. రిజల్ట్‌ను బట్టి, ఎన్టీఆర్ కమిట్మెంట్లను బట్టి నిర్ణయం తీసుకోవాలనుకున్నారు.ఇప్పుడు సినిమా ఫలితం తేలిపోయిన నేపథ్యంలో ‘దేవర-2’ను ఎప్పుడు మొదలుపెట్టాలనే విషయంలో ఒక అంచనాకు వచ్చినట్లు సమాచారం. వచ్చే ఏడాది చివర్లో ఈ చిత్రం సెట్స్ మీదికి వెళ్లొచ్చట.

ఆ తర్వాత ఇంకో ఏడాదికి.. బహుశా దసరా లేదా క్రిస్మస్ టైంకి సినిమాను విడుదలకు సిద్ధం చేయాలని అనుకుంటున్నారట. రెండో భాగానికి టెక్నికల్ టీంలో కొన్ని మార్పులు ఉండొచ్చని సమాచారం.అప్పటి వీలును బట్టి టెక్నీషియన్లను ఎంచుకుంటారట. ప్రస్తుతం తారక్ చేతిలో వార్-2తో పాటు ప్రశాంత్ నీల్ సినిమా ఉంది. ఇవి రెండూ పూర్తి కావడానికి కనీసం ఏడాది సమయం పట్టొచ్చు. అవి పూర్తయ్యే సమయానికి కొరటాల వీలైతే వేరే సినిమా చేసి ఆ తర్వాత దేవర-2ను మొదలుపెట్టొచ్చు. లేదా అప్పటి వరకు వెయిట్ చేయొచ్చు.

తమిళంలో డిజాస్టర్

తమిళంలో మాత్రం నిరాశపరిచింది. దీంతో తమిళనాడులోని ప్రేక్షకులు ఇతర భాషా హీరోల చిత్రాలను ఎక్కువగా ప్రోత్సహించరని ఈ సినిమాతో మరోసారి రుజువైంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో దేవర కేవలం 8 కోట్ల ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసిందని తమిళ విశ్లేషకులు తెలిపారు. ఓవర్సీస్‌లో కూడా దేవర తమిళ వెర్షన్ ద్వారా 15 వేల డాలర్లనే మాత్రమే వసూలు చేయగలిగింది. ఎన్టీఆర్ చాలా కష్టపడి ఐదు భాషల్లో తానే డబ్బింగ్ చెప్పుకున్నాడు. ఇప్పటికీ తమిళ ప్రేక్షకులు ఎప్పటిలాగానే తెలుగు హీరోల సినిమాలకి ఆసక్తి చూపించలేదు. అందుకే ఇక నుంచి మన దర్శకనిర్మాతలు దక్షిణాది భాషలన్నింటిలో విడుదల చేయడం కంటే తెలుగు, హిందీ వెర్షన్లపై దృష్టి సారిస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు.

Leave a Comment