Ginger | ఆరోగ్యాన్ని ఎంతగానో పరిరక్షించే అల్లంను (Ginger) తీసుకోవడం అందరికి అంతగా ఇష్టం ఉండదు. కానీ ఆరోగ్యపరంగా అల్లం చేసే మేలు అంతా ఇంతా కాదు.అల్లంలో ఎన్నోఔషధ గుణాలు దాగున్నాయి. సాధారణంగా మన వంటింట్లో అల్లం ఓ ముఖ్య మైన పదార్థం.ఈ వర్షాకాలంలో అల్లంను సేవించడం వలన జలుబు, దగ్గు, ఆయాసం నుంచి ఉపశమనం పొందుతారు.అలాగే అల్లంలోని జింజెరాల్.. వాంతులు, వికారం రాకుండా చేస్తుంది.కీళ్ల వాపుల్ని తగ్గిస్తుంది. ఇక.. షోగాల్.. క్యాన్సర్, గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది. మూడోదైన జింజిబెరెన్.. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.ఇంతేకాదు.. అల్లం మన బ్రెయిన్ బాగా పనిచేసేలా చేస్తుంది. మన వ్యాధినిరోధక శక్తి (ఇమ్యూనిటీ)ని పెంచుతుంది.మీ శరీరంలో వేడి, నొప్పులు, వాపులు తగ్గిపోతాయి.మీకు తెలుసుగా.. తరచూ వేడి చేస్తూ ఉంటే.. మనం త్వరగా ముసలివాళ్లం అయిపోతాం. అందువల్ల శరీరానికి చలవ చేసే అల్లాన్ని వాడటం మేలు.
ఎముకలకు బలం..
అల్లాన్ని కాల్చి తీసుకోవడం వల్ల ఎముకలకు మంచిది. వేయించిన అల్లంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇది వాపును తగ్గించడంలో సహాయపడుతుంది.కీళ్ల నొప్పులతో బాధపడే వారికి ఇది చక్కని ఉపశమనాన్ని అందిస్తుంది. బోలు ఎముకల సమస్యను తగ్గిస్తుంది.అలాగే మధుమేహానికి కూడా అల్లం, మధుమేహా రోగులకు కూడా మేలు చేస్తుంది. వేయించిన అల్లం మధుమేహ రోగులకు చాలా మేలు చేస్తుంది. ఇది రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది.ఇంకా వేయించిన అల్లం, తేనె వర్షాకాలంలో క్రమం తప్పకుండా తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.అల్లం, తేనె తీసుకుంటే వర్షాకాలంలో రోగనిరోధక శక్తిని బలోపేతం అవుతుంది. ఇది అనేక వ్యాధులు, ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతుంది. పిల్లలకు 1 టీస్పూన్ తేనెలో కొద్దిగా అల్లం రసం కలిపి ఇస్తే మంచి ఫలితం ఉంటుంది.
కడుపునొప్పి.
కడుపునొప్పి వేధిస్తుంటే ఒక చిన్న అల్లం ముక్కను తినండి వెంటనే మార్పు కనిపిస్తుంది. ఇక మగవారిలో వచ్చే అలాంటి సమస్యలకు కూడా అల్లం దివ్యౌషధంగా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు.అయితే కొందరిలో పచ్చి అల్లం తీసుకుంటే ఇబ్బందులు కూడా ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అల్లం తీసుకునే ముందు వైద్యుల సూచనలు పాటించడం బెస్ట్.పీరియడ్స్ సమయంలో అల్లం ముక్కను నమలడం వల్ల నొప్పి, తిమ్మిరి ఫిర్యాదులు తగ్గుతాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉదయాన్నే ఖాళీ కడుపుతో అల్లం తీసుకుంటే, చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది. ఖాళీ కడుపుతో అల్లం తీసుకోవడం వల్ల జీవక్రియ రేటు పెరుగుతుంది, ఇది బరువు తగ్గడానికి దారితీస్తుంది.
గొంతు నొప్పి
వర్షాకాలంలో గొంతు నొప్పి తగ్గించడానికి అల్లాన్ని వేయించి పొడిగా చేయాలి. ఈ పొడిని తేనెతో కలిపి తీసుకోవాలి.ఈ మిశ్రమాన్ని రోజూ తీసుకుంటూ ఉంటే గొంతునొప్పి తగ్గిపోతుంది. ఇలా కుదరకపోతే అల్లాన్ని తురిమి లేదా దంచి రసం తీయాలి.అల్లం, తేనె కలిపి తీసుకోవడం వల్ల ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు జ్వరం, ఇతర ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తాయి. అల్లాన్ని పచ్చిగా కాకుండా కాల్చినది తీసుకుంటే మంచిది.
Also Read : రాజేంద్ర ప్రసాద్ జీవితంలో ఇన్ని బాధలు ఉన్నాయా..
హిమోఫిలియా
ఈ హిమోఫిలియా అనేది జన్యుపరమైన రుగ్మత. వీరికి చిన్న గాయం తగిలిన విపరీతమైన రక్తస్రావం జరిగి ఒక్కొక్కసారి మరణం కూడా సంభవిస్తుంది.కాబట్టి హిమోఫిలియా మందులు వాడేవారు అల్లం తినడం వలన మందుల ప్రభావం అనేది తగ్గుతుంది.అయితే అధిక బరువు అనేది ఎంత పెద్ద సమస్యో అలాగే తక్కువ బరువు ఉండడం కూడా అంతే పెద్ద సమస్య.అయితే మీరు బరువు పెరగాలి అని ప్రయత్నిస్తే మాత్రం అల్లం ఉన్న ఆహారాలకు దూరంగా ఉండాలి. ఈ అల్లం లో ఫైబర్ అనేది సమృద్ధిగా ఉంటుంది. ఇది కడుపులోని pH స్థాయిలను పెంచడం వలన జీర్ణవ్యవస్థను ప్రేరేపిస్తుంది.
ఇమ్యూనిటీ
ఇమ్యూనిటీని పెంచడంలో కూడా అల్లం ముందుంటుంది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో అల్లం నీరు తాగితే ఇమ్యూనిటీ పెరుగుతుంది.ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్‌ని నిరోధించడం ద్వారా ఆరోగ్యం బాగుంటుంది.అల్లంలో శోథ నిరోధక లక్షణాలు ఉంటాయి. ఇవి సంక్రమణ ప్రమాదాన్ని తగ్గించడంలో హెల్ప్ చేస్తాయి. దీంతో మొత్తం ఇమ్యూనిటీ మెరుగవుతుంది. ఖాళీ కడుపుతో అల్లం నీటిని తాగితే చాలా మంచిది.
పొట్ట సమస్యలు
పొట్ట సమస్యలకు అల్లం మంచి నివారణను అందిస్తుంది. కడుపులోని అదనపు వాయువును బహిష్కరించడానికి ఇది బాగా సహాయపడుతుంది.మరియు మీరు అజీర్ణ సమస్యతో బాధపడుతుంటే, భోజనం తిన్న తర్వాత తేనెలో నానబెట్టిన అల్లం ముక్క తినండి. అందువలన జీర్ణక్రియ బాగా జరుగుతుంది.ప్రధానంగా తేనెలో నానబెట్టిన అల్లం తినడం వల్ల కడుపు ఉబ్బరం సమస్య నుంచి బయటపడుతుంది.అలాగే ఉబ్బసం ఉన్నవారికి అల్లం మంచిది.ఉబ్బసం చికిత్సకు అల్లం చాలాకాలంగా ఉపయోగించబడింది. అల్లం రసం తాగడానికి ఇష్టపడని వారికి అల్లం తేనెలో నానబెట్టి రోజూ తినవచ్చు. ఇది రుచికరమైనది మరియు ఉబ్బసం నయం చేస్తుంది.
అల్లం, తేనెతో కలిగే ప్రయోజనాలు…
అల్లం పై పొట్టును తొలగించి తురుముకోవాలి. దీనిని మెత్తగా చేసుకున్నాకా కాస్త తేనెను కలిపి తీసుకోవాలి. అల్లం, తేనెతో గొంతులో వాపును కూడా తగ్గిస్తుంది. వేయించిన అల్లాన్ని తేనెతో కలిపి తీసుకుంటే గొంతులో పేరుకున్న శ్లేష్మం వెంటనే బయటకు వస్తుంది. దగ్గు, కఫం నుంచి ఉపశమనానికి, గొంతు నొప్పికి అల్లం, తేనె మిశ్రమం చక్కగా పనిచేస్తుంది. ఇది గొంతులోని ఇబ్బందిని, శ్లేష్మాన్ని తగ్గిస్తుంది.ఇంకా వేయించిన అల్లం, తేనె వర్షాకాలంలో క్రమం తప్పకుండా తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అల్లం, తేనె తీసుకుంటే వర్షాకాలంలో రోగనిరోధక శక్తిని బలోపేతం అవుతుంది. ఇది అనేక వ్యాధులు, ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతుంది. పిల్లలకు 1 టీస్పూన్ తేనెలో కొద్దిగా అల్లం రసం కలిపి ఇస్తే మంచి ఫలితం ఉంటుంది.
Also Read : మొదట మహేష్, నమ్రతా పెళ్లికి అడ్డుపడింది ఎవరో తెలుసా..?
రక్తపోటును నియంత్రిస్తుంది..
అల్లంలో ఉండే పొటాషియం అధిక రక్తపోటును అదుపులో ఉంచుతుంది. ఇది కాకుండా, అల్లంలో ఉండే యాంటీఆక్సిడెంట్ మూలకాలు శరీరం యొక్క అంతర్గత నిర్మాణాలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. వివిధ వ్యాధుల నుండి రక్షించడంలో సహాయపడతాయి.అల్లం తీసుకోవడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది. మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇది కాకుండా, అల్లంలో ఉండే విటమిన్ ఎ మరియు యాంటీఆక్సిడెంట్లు కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో సహాయపడతాయి.అల్లం రెగ్యులర్ గా తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది. అల్లం తీసుకోవడం వల్ల జీర్ణక్రియతో పాటు జీవక్రియ కూడా పెరుగుతుంది కాబట్టి బరువు తగ్గడంలో సహాయపడుతుంది.
అల్లం తీసుకునే పలు మార్గాలు..
అల్లాన్ని వంటలలో జోడించడమే కాకుండా టీలో తీసుకోవచ్చు. అల్లం రసాన్ని తేనె లేదా నిమ్మరసంతో కలిపి తీసుకోవచ్చు. మీరు అల్లం పచ్చడి లేదా ఊరగాయగా ఉపయోగించవచ్చు. అల్లం ముక్కను ఎండబెట్టడం వల్ల అందులోని విటమిన్లు, మినరల్స్, ఇతర పోషకాల పరిమాణం పెరుగుతుంది. తాజా అల్లం ఉత్తమమైనది, ఎందుకంటే దానిలో అన్ని పోషకాలను పొందవచ్చు. తాజా అల్లం ముక్కలను బ్లెండర్లో గ్రైండ్ చేసి దాని రసాన్ని తీయాలి. ఈ జ్యూస్‌ను భోజనానికి ముందు త్రాగాలి. సలాడ్లలో అల్లం చేర్చడం వల్ల ఆహార రుచి మెరుగవుతుంది. ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు. ఉదయాన్నే ఖాళీ కడుపుతో అల్లం రసం తాగడం వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది.
బరువు తగ్గడానికి అల్లం టీ
అల్లం టీ చేయడానికి, ఒకటి నుండి ఒకటిన్నర కప్పు నీటిని వేడి చేయండి. అల్లం ముక్కలు కోసి ఈ నీళ్లలో వేయాలి. అల్లం ఉడికిన తర్వాత టీని ఫిల్టర్ చేసి కప్పులోకి తీసుకోవాలి. ఈ టీలో కొన్ని చుక్కల నిమ్మరసం , అర టీస్పూన్ తేనె కూడా కలిపి తాగవచ్చు. ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో ఈ టీని తీసుకోవడం వల్ల బరువు తగ్గడంతోపాటు లోపల బెల్లీ ఫ్యాట్ కనిపించడం తగ్గుతుంది. అల్లం టీ తాగడమే కాకుండా, అల్లం కూరగాయలలో కలిపి వండటం కూడా మంచిదే..
అల్లం పాలు
అల్లం పాలను ప్రతిరోజు ఉదయం సాయంత్రం సేవిస్తే చలికాలంలో బాగా ఇబ్బంది పెట్టే గొంతు ఇన్ఫెక్షన్లు, శ్వాస ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో సహాయపడి దగ్గు ,జలుబు,కఫం, గొంతు నొప్పి ముక్కు కారడం వంటి అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గిస్తుంది. రోజూ అల్లం పాలు తాగితే జీర్ణ వ్యవస్థ బలపడి మలబద్ధకం, అజీర్తి, యాసిడ్ వంటి సమస్యలు దూరమౌతాయి.అల్లంలో ఉండే థర్మోజెనిక్ గుణాలు చలికాలంలో మనల్ని వెచ్చగా ఉంచి శరీర ఉష్ణోగ్రతలను బ్యాలెన్స్ చేయడంతో పాటు జీవక్రియ రేటును కూడా పెంచుతుంది. అల్లం లోని యాంటీ ఆక్సిడెంట్ చెడు కొలెస్ట్రాల్ శాతాన్ని తగ్గించి గుండె ఆరోగ్యాన్ని, రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది. మానసిక ఒత్తిడిని తగ్గించి నిద్రలేమి సమస్యను తగ్గించడంలో సహాయపడుతుంది.
అల్లం వంటకల్లో వినియోగించడం వల్ల దంతాలు ఆరోగ్యంగా ఉండటంతో పాటు నోటి దుర్వాసన పోతుంది. చాలామంది ప్రయాణాల్లో వాంతులతో ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వాళ్లు అల్లంతో చేసిన టీ తాగితే ఆ సమస్య దూరమవుతుంది. వేసవి కాలంలో వడదెబ్బ బారిన పడకుండా మజ్జిగలో అల్లం కలిపి తీసుకుంటే మంచిది. అల్లం రక్తంలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో సహాయపడుతుంది.
దానితోపాటు జీర్ణ సంబంధిత సమస్యలతో బాధ పడేవాళ్లు అల్లంతో చేసిన వంటకాలు తీసుకుంటే ఆ సమస్యలు దూరమవుతాయి. కడుపు ఉబ్బరం, మలబద్ధకం లాంటి సమస్యలకు అల్లం సులువుగా చెక్ పెడుతుంది. మంచి యాంటీ ఆక్సిడెంట్ గా పని చేసే అల్లం రక్తాన్ని శుద్ధి చేయడంలో తోడ్పడుతుంది.చైనా దేశంలో అనేక రోగాలకు చెక్ పెట్టేందుకు అల్లంను ఔషధాల తయారీలో అక్కడి శాస్త్రవేత్తలు వినియోగిస్తున్నారు. కూరలు, పచ్చళ్లలో మనం అల్లంను ఎక్కువగా వినియోగిస్తాం.
Also Read : అనుష్క పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఎవరంటే..?
అల్లం రసం
అల్లం లో ఉండే పోషకాలు కారణంగా అనేక సమస్యలు దూరం అవుతాయి. అలా అని సాధారణంగా గర్భిణీలు, మోషన్ సిక్నెస్ తో బాధ పడేవారు వికారం మరియు వాంతులు తగ్గడానికి ఉపయోగిస్తారు. అల్లం లోని పోషకాలు అనేక సమస్యలని దరి చేరకుండా చేస్తుంది. దీనివల్ల మెదడు పనితీరు కూడా బాగుంటుంది. ఇక ఎదిగే పిల్లలకి అల్లాన్ని రసం రూపంలో పట్టించడం ద్వారా వారు ఎదుగుదల బాగుండడంతో పాటు అనేక బెనిఫిట్స్ ఉంటాయి.
రోజు క్రమం తప్పకుండా అల్లం రసం పడగడుపున తీసుకునే వారికి జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది.అలాగే ప్రజెంట్ ఉన్న చాలా మందిని వేధిస్తున్న వ్యాధి డయాబెటిస్. డయాబెటిస్ ని కంట్రోల్ చేయడంలో కూడా అల్లం రసం ముఖ్య పాత్ర పోషిస్తుంది. వేలకు వేలు పోసి టాబ్లెట్స్ ని వాడే కంటే ఈ అల్లం రసంతో న్యాచురల్ గా మీ సమస్యలకు చెక్ పెట్టవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం ప్రతిరోజూ అల్లం రసాన్ని పడగడుపున తీసుకుని ఈ అద్భుతమైన బెనిఫిట్స్ ని మీ సొంతం చేసుకోండి.