Anchor Udaya Bhanu | నేటికాలంలో సోషల్ మీడియా కారణంగా చిన్న పెద్దా అని తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ ఎంతలా ఫాలోవింగ్ పెరిగిపోయింది. ముఖ్యంగా అబ్బాయిల కంటే అమ్మాయిలకు ఎక్కడ లేని ఫాలోవర్స్ ఉంటున్నారు. ఏ చిన్న వీడియో తీసి పెట్టినా నిమిషాల్లో వేలల్లో లైక్స్ వస్తున్నాయి. ఇదే సమయంలో సెలబ్రిటీలకు కూడా సోషల్ మీడియా లో భారీ స్థాయిలో అభిమానులు ఫాలో అవుతున్నారు. అందుకే సెలబ్రిటీలకు సంబంధించిన త్రో బ్యాక్ ఫోటోలు కానీ, ప్రస్తుతం ఫోటోలు కానీ నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంటాయి.తాజాగా ఉదయ భాను సంబంధించిన చిన్ననాటి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతోంది. బుల్లితెర క్వీన్ ఉదయభాను గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.
ఉదయభాను ఫస్ట్ షో..
తన అందం, అభినయంతో టాలీవుడ్ ను ఓ ఊపు ఊపింది. అంతేకాక ఒకప్పుడు ఆమె లేని షోలేదంటే అతిశయోక్తి కాదు. ఇంకా చెప్పాలంటే.. ఈమెను బుల్లితెర శ్రీదేవి అని ముద్దుగా పిలుచుకుంటారు. అప్పట్లో అత్యధిక పారితోషికం అందుకున్న యాంకర్ గా ఈమె రికార్డు సృష్టించింది.యాంకర్లు కూడా గ్లామర్ వడ్డించగలరు అనే ట్రెండ్ ఉదయ భానుతోనే మొదలైందని చెప్పాలి. తన కుటుంబ కష్టాలు, ఆర్థిక ఇబ్బందులతో 15 ఏళ్ల వయసులోనే హోస్ట్ గా మారిన ఉదయభాను.. హృదయాంజలి ప్రోగ్రామ్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.ఉదయభానుకు ఓ హీరోయిన్ రేంజ్ లో ఫ్యాన్ ఫోలోయింగ్ ఉంది.
బుల్లితెరతో పాటు వెండి తెరపై కూడా ఉదయభాను మెరిశారు. లీడర్ సినిమాలో ప్రత్యేక గీతంలో కూడా నటించారు.ఒక సమాయంలో హృదయాంజలి,
వన్స్ మోర్ ప్లీజ్,
సాహసం చేయరా దింబకా,
జానవులే నెరజానవులే, నువ్వు నేను
, లక్స్ డ్రీమ్ గర్ల్
, ఛాంగురే బంగారు లేడీ
, లక్కీ లక్ష్మి
, డాన్సింగ్ స్టార్
, గోల్డ్ రష్
, తీన్‌మార్
, రేలా రే రేలా
, రంగం
, ఢీ
, నీతోనే డాన్స్
, గ్యాంగ్ లీడర్
, బొమ్మా బొరుసు
, కళ్యాణ లక్ష్మి
వంటి షోస్ చేసి మెప్పించింది. ఉర్రూతలూగించింది.అలా బుల్లితెరపై చాలా కాలం పాటు రారాణిగా ఓ వెలుగు వెలిగింది. ఆర్.నారాయణ మూర్తి హీరోగా నటించిన ‘ఎర్ర సైన్యం’ చిత్రంతో నటిగా కెరీర్ ను ప్రారంభించింది ఉదయ భాను.
ఇద్దరు కవల పిల్లలు
ఆ తరువాత ‘బస్తీ మె సవాల్’ ‘కొండవీటి సింహాసనం’ ‘ఖైదీ బ్రదర్స్’ ‘శ్రావణమాసం’ వంటి చిత్రాల్లో కూడా నటించింది. అయితే అన్ని సినిమాల్లో నటించినా రాని గుర్తింపుని యాంకర్ గా రాబట్టుకుంది ఉదయభాను. ‘వన్స్ మోర్ ప్లీజ్’ ‘సాహసం చెయ్యరా డింబకా’ వంటి షోలతో క్రేజ్ ను సంపాదించుకుంది. అయితే ఈమె గత కొంత కాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ వస్తోంది.కారణం కెరీర్ మంచి పీక్స్ లో ఉన్నప్పుడే విజయ్ కుమార్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుని కొత్త లైఫ్ లోకి వెళ్లారు. వీరికి భూమి, ఆరాధ్య ఇద్దరు కవల పిల్లలు జన్మించారు. వీరి పేర్లు భూమి ఆరాధ్య, యువి నక్షత్ర.. ! అప్పుడప్పుడు తన సోషల్ మీడియాలో వీరి ఫొటోలను పోస్ట్ చేస్తూ ఉంటుంది ఉదయభాను.
Also Read : ఒక్క ఈవెంట్‌కి యాంకర్ సుమ ఎన్ని లక్షలు తీసుకుంటుందో తెలుసా.
విజయ్ కుమార్ మొదట్లో ఉదయ భాను వద్ద డ్రైవర్ గా చేసేవాడని.. లేదు ఉదయభాను ఆఫీస్ లో జాబ్ చేసేవాడని రకరకాలుగా అంటూ ఉంటారు. కాగా ఆయన ఏం చేసేవాడో కానీ ఉదయ భాను ని మాత్రం ప్రేమలో పడేశాడు.అయితే ప్రేమలో పడ్డ తర్వాత పెళ్లి విషయంలో తల్లితో గొడవలు పడింది.ఇకపోతే ఆ గొడవల కారణంగానే ఉదయ భాను బుల్లి తెర కెరియర్ కాస్త గందరగోళానికి గురైంది అంటూ బుల్లి తెర వర్గాల వారు అంటారు.
అయితే బిగ్ బాస్ సీజన్ 6 కు ఉదయభాను సంపాదించారని తాజా వార్త. ఇందుకోసం ఉదయభానుకు భారీ రెమ్యునరేషన్ ను కూడా ఆఫర్ చేశారట. అయితే ఉదయభాను మాత్రం బిగ్ బాస్ లో పాల్గొనడానికి ఆసక్తి చూపడంలేదని తెలుస్తోంది. అయినా కూడా బిగ్ బాస్ నిర్వాహకులు మాత్రం ఆమె ఎలాగైనా ఒప్పించాలని ప్రయత్నిస్తున్నారట.
ముస్లిం వ్యక్తితో పెళ్లి
కరీంనగర్ జిల్లాకు చెందిన ఉదయభానుకు చాలా చిన్న వయస్సులోనే ఓ వ్యక్తితో పెళ్లయ్యింది. అయితే ఆ ముస్లిం వ్యక్తితో జరిగిన పెళ్లి ఆమెకు అస్సలు ఇష్టం లేదు. ఉదయభాను తల్లి ఆమెను బలవంతంగా అతడికి ఇచ్చి ఆమె పెళ్లి చేసింది.అయితే కొద్ది రోజులకే ఆమె తన మొదటి భర్తకు దూరమైంది. తర్వాత ఆమె చదువు పై శ్రద్దపెట్టి టీవీ యాంకరింగ్ పై దృష్టి పెట్టి సక్సెస్ అయ్యింది. తర్వాత ఉదయభాను విజయ్ కుమార్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. మొదటి నుంచి ఎన్నో వివాదాలకు కేంద్రబింధువుగా నిలిచిన ఉదయభాను ఇప్పుడు సంతోషంగా జీవిస్తుంది.
బాలయ్యతో అనుబంధం..
బాలయ్యతో అనుబంధాన్ని, ఆయన చేసిన పనిని బయటపెట్టి ఎమోషనల్ అయ్యింది ఉదయభాను. ఆ రోజు తనకు దేవుడు కనిపించాడంటూ కన్నీళ్లు పెట్టుకుంది. తాజాగా ఇది వైరల్‌గా మారింది. మరి బాలయ్య ఏం చేశాడు, ఆమె ఎందుకు కన్నీళ్లు పెట్టుకుందనేది చూస్తే..నీతోనే డాన్స్` షోలో బాలకృష్ణ గురించి చర్చ వచ్చింది. ఈసందర్భంగా యాంకర్‌గా ఉన్న ఉదయభాను రియాక్ట్ అవుతూ నేనూ బాలయ్య బాబు గురించి ఓ విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నా అని చెప్పి తాను ఎక్కడ స్టార్ట్ అయ్యిందో తెలిపింది. తాను 12ఏళ్ల నుంచి పనిచేయడం ప్రారంభించిందట. తన జీవితంలో సెలబ్రేషన్ అనేదే లేదట. ఆడపిల్లలకు కోరికలుంటాయి.
Also Read : నాగచైతన్య నికర ఆస్తులు ఎన్ని వందల కోట్లో తెలుసా..?
అయితే ప్రెగ్నెంట్ అయ్యాక ఆ కోరికలు మరింతగా పెరుగుతాయి. సీమంతం చేసుకోవాలని ఉంటుంది. కానీ కొన్ని సంఘటనల తర్వాత దేవుడు లేడనిపించింది. ఇదంతా ట్రాష్ అనుకున్నా. దేవుడుని నమ్మకూడదనుకున్నా. పిల్లలంటే ఎంత ఇష్టమో మాటల్లో చెప్పలేను. కానీ నా దగ్గర్నుంచి ప్రతి బిడ్డని కొందరు దూరం చేసేశారు.ఫైనల్‌గా నాకంటూ ఇద్దరు బిడ్డలను ఇచ్చాడు దేవుడు. ఫస్ట్ టైమ్, నా ఫస్ట్ బిడ్డకి ఫస్ట్ బర్త్ డే సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నా. ఎన్నిసార్లు ఫోన్ చేసిన కొందరు రెస్పాన్సే ఇవ్వలేదు. బాలయ్య బాబు నెంబర్‌కి ఒక్క మెసేజ్ పెట్టాను. ఇలా నా బేబీ ఫస్ట్ బర్త్ డే సర్, నా లైఫ్‌లోనే ఫస్ట్ పండగా, మీరు వస్తే సంతోషిస్తాను అని మెసేజ్ పెట్టాను. అంటే అయేనే గంటలో వచ్చారు.
మళ్ళీ రీ ఎంట్రీ
చాలా రోజుల తర్వాత ఇప్పుడు మళ్లీ బుల్లితెరపై ఉదయభాను కనిపించింది. ఈ మధ్య మళ్లీ చిన్న చిన్న ఈవెంట్స్ లో కనిపిస్తుంది ఉదయభాను. కానీ గుర్తు పెట్టుకునే ఈవెంట్ ఒక్కటి కూడా చేయలేదు. ఇలాంటి సమయంలో మొన్న రిలీజైన బాలయ్య అఖండ సినిమా సక్సెస్ ఇంటర్వ్యూ చేసి అందరి దృష్టి తనపై పడేలా చేసింది.తాజాగా నేచురల్ స్టార్ నాని నటించిన శ్యామ్ సింగరాయ్ టీమ్‌తో కూడా స్పెషల్ చిట్‌చాట్ చేసి మంచి పేరు తెచ్చుకుంది. ఇక తిరుపతిలో జరిగిన పుష్ప సినిమా సక్సెస్ మీట్ కూడా ఉదయభాను యాంకరింగ్ చేసింది. వయస్సు పెరిగినా క్రేజ్ మాత్రం తగ్గదు అని ఈమె స్టేజ్ మీదకి వచ్చినప్పుడు ప్రేక్షకుల అరుపులు చూస్తే అర్థమవుతుంది. ఇప్పటికీ ఈమె సరిగ్గా కాన్సన్‌ట్రేట్ చేస్తే బిజీ అవుతుందని అంటున్నారు ఉదయభాను అభిమానులు.
యూట్యూబ్ ఛానల్
తాజాగా తనపేరుతో ఒక యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేసింది. అందులో తనకి సంబంధించిన ప్రతీ విషయాన్ని వ్లాగ్ ల రూపంలో చేస్తూ వస్తుంది. ఉదయభాను ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్ లో యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులకి దగ్గరగా ఉంటుంది. అయితే తనకంటూ ఒక యూట్యూబ్ ఛానెల్ ని క్రియేట్ చేసి అందులో ట్రెండింగ్ లో ఉన్న వాటికి సంబంధించిన వ్లాగ్ లు అప్లోడ్ చేస్తుంది. కాగా వాటికి అత్యధిక వ్యూస్ వస్తున్నాయి.
హోమ్ టూర్ వ్లాగ్, స్కిన్ కేర్ వ్లాగ్, సండే చికెన్ వ్లాగ్ ఇలా అటు బ్యూటీ కేర్, ఇటు ఫుడ్ ఇలా అన్ని కవర్ చేస్తుంది ఉదయభాను. అయితే తాజాగా ‘ఏది దేశం తమ్ముడా’ అనే పాటని ఉదయభాను రాసింది. తనే పాడింది. కాగా ఈ పాట కూడా వైరల్ అయింది. స్టార్ మా టీవీ కార్యక్రమాల్లో భాగంగా వరలక్ష్మి వ్రతానికి సంబంధించిన ఒక ఈవెంట్ లో పాల్గొంది ఉదయభాను. అయితే ఇప్పుడు తాజాగా వ్యవసాయం చేస్తున్నట్టుగా ఒక వీడీయోని తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది ఉదయభాను.
ఇంద్రభవనంలా ఇల్లు
ఉదయభాను తాజాగా కొత్త ఇంటిలోకి గృహప్రవేశం చేసినట్టు తెలుస్తుంది.అయితే ప్రస్తుతం ఇంకా ఇంటి పనులు జరుగుతుండగానే ఈమె చాలా సింపుల్ గా గృహప్రవేశ కార్యక్రమాన్ని నిర్వహించారు. తన భర్త పిల్లలతో కలిసి గృహప్రవేశం చేసిన ఉదయభాను అనంతరం ఇంట్లో పాలు పొంగించి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశారు.అయితే ఇందులో భాగంగానే (Udaya Bhanu) తన హోమ్ టూర్ వీడియోని కూడా అందరితో షేర్ చేసుకున్నారు. ప్రస్తుతం ఇంకా కాస్త పనులు మిగిలిపోయాయని ఉదయభాను తెలియజేశారు.
అయితే మొత్తం పాలరాతితో కట్టిన ఇంద్రభవనంలా ఈ ఇల్లు ఉందని చెప్పాలి. అసలు ఉదయభాను ఇంటిని చూడటానికి రెండు కళ్ళు ఏమాత్రం సరిపోలేదు.కాగా ఇటీవలే ఓ కాస్ట్‌లీ బెంజ్ కారును కొనుగోలు చేశారు ఈ యాంకర్. కారును షోరూమ్ వాళ్లు డెలివరీ ఇస్తోన్న సమయంలో తీసిన ఫొటో తాజాగా బయటికి వచ్చింది. అయితే ఒకప్పుడు కేవలం అగ్రతారలు మాత్రమే ఖరీదైన కార్లను కొనుగోలు చేసేవారు. కానీ ఇటీవల యాంకర్స్, సింగర్స్, క్యారెక్టర్ ఆర్టిస్టులు సైతం అదిరిపోయే కార్లు, బంగ్లాలు కొనేస్తున్నారు. ఇండస్ట్రీ మాంచి రైజ్‌లో ఉంది అనడానికి ఇలాంటి ఇన్సిడెంట్స్ ఉదాహారణగా నిలుస్తాయి.
వస్తున్నా
సోమవారం నుండి శనివారం వరకు మా ఆడవాళ్లకు డైలీ సీరియల్‌లాగా ఇల్లు, పని.. లేకపోతే ఇంట్లో పని. సండే కూడా ఫన్ లేదు.. ఆడడానికి లేదు, చూడడానికి లేదు’’ అంటూ ఈ ప్రోమోలో మీనా.. తన లైఫ్ బోరింగ్ అయిపోయింది అన్నట్టుగా విసుక్కుంటుంది. ఆ తరువాత అమ్మ చెప్పేది అమ్మగా గెలిస్తేనే అన్నింటిలో గెలిచినట్టు అని. అమ్మను అయ్యాకే అమ్మ చెప్పింది గుర్తొచ్చింది. అన్నీ పక్కన పెట్టేశాను. పిల్లలే జీవితం అయిపోయారు. నాకు అమ్మలు అయిపోయారు’’ అంటూ ఉదయభాను.. తన పర్సనల్ లైఫ్ గురించి చెప్తున్న మాటలతో ఈ ప్రోమో ప్రారంభమవుతుంది. అదే సమయంలో ‘‘ఆపొద్దు అమ్మ’’ అంటూ తన పిల్లలు చెప్పడంతో ‘సూపర్ జోడీ’తో యాంకర్‌గా రీఎంట్రీ ఇస్తున్నట్టుగా ప్రకటించింది.