Anchor Suma | ఒక్క ఈవెంట్‌కి యాంకర్ సుమ ఎన్ని లక్షలు తీసుకుంటుందో తెలుసా.

Anchor Suma | మలయాళీ అమ్మాయి అయినా తన మాటలతో, షోలలో తన కబుర్లతో, ఈవెంట్స్ లో తన వాగ్దాటితో దాదాపు గత 20 ఏళ్లుగా తెలుగు ప్రేక్షకులని మెప్పిస్తూ తెలుగు వారిళ్ళల్లో ఒక ఆడపడుచు అయ్యింది యాంకర్ సుమ కనకాల.. సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ అయినా.. టీవీ టాక్ షోలైనా.. గేమ్ షోలైనా.. తనదైన మాట తీరుతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు సుమ. స్టార్ హీరోలు సైతం సుమకు ఫ్యాన్స్ గా మారిపోయారు. అంతలా ఆమె చలాకీగా తెలుగులో మాట్లాడుతూ.. యాంకరింగ్ చేస్తూ అలరిస్తున్నారు. ఇక సుమ పలు సీరియల్స్ తో పాటు సినిమాల్లోనూ నటించారు. 2006లో ‘అవాక్కయ్యారా…’అనే ప్రోగ్రాంతో యాంకరింగ్‌ కెరీర్ మొదలు పెట్టరు సుమ.

రాజీవ్ తో పెళ్లి

అంతకు ముందు సినిమాల్లోనూనటించారు సుమ నటించిన తొలి సినిమా ఎదో తెలుసా..? సుమ హీరోయిన్ గా నటించిన తొలి సినిమా కళ్యాణ ప్రాప్తిరస్తు. దాసరి నారా యణరావు దర్శకత్వంలో కళ్యాణ ప్రాప్తిరస్తు సినిమాలో మెయిన్‌ హీరోయిన్‌ గా నటించారు సుమ. ఆ తర్వాత మలయాళంలో కూడా రెండు సినిమాల్లో హీరోయిన్ గా చేశారు సుమ.అయితే యాంకరింగ్ లోకి వచ్చిన తర్వాత సినిమాల పైన అంత మక్కువ చూపలేదు సుమ. పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించినప్పటికీ ఆమె ఎక్కువగా యాంకరింగ్ పైనే దృష్టి పెట్టారు. రీసెంట్ గా జయమ్మ పంచాయితీ అనే సినిమాలో నటించారు.

ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది.ఇక సుమ పర్సనల్ లైఫ్ గురించి తెలిసిందే. ఆమె భర్త సినీ నటుడు రాజీవ్ కనకాల.1994 వ సంవత్సరంలో సుమకు ప్రేమ సందేశాన్ని పంపాడు. దాదాపు 5 ఏళ్ల తర్వాత 1999 లో వారి ప్రేమ పెళ్లి జరిగింది. వీళ్ళ ప్రేమ పెళ్లి కూడా అంత ఈజీగా జరగలేదు. వారి మధ్య ప్రేమ గురించి రాజీవ్ కనకాల తల్లిదండ్రులకు మొదట సుమే చెప్పింది. వారి పెళ్లికి దేవదాస్ కనకాల ఓ కండిషన్ కూడా పెట్టారు. ఆ విషయాలను దేవదాస్ కనకాల గతంలో జరిగిన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.’మీ అబ్బాయి నేను ప్రేమించుకుంటున్నాం. మీరు అంగీకరిస్తే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాము’ అని ఓ రోజు సుమ నాకు ఫోన్ చేసి చెప్పింది.

Anchor Suma

కోపం అంటే అసలు నచ్చదు..

అప్పటికే వారి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తున్నట్టు మేం గ్రహించాం. అయితే సుమకు మాత్రం ఓ విషయం క్లారిటీగా చెప్పాను. నువ్వు మీ అమ్మా నాన్నలకు ఒక్కగానొక్క కూతురివి. మీ వాళ్ళు ఒప్పుకుంటేనే రాజీవ్ తో నీ పెళ్లి జరుగుతుంది. లేదంటే మాత్రం మీ పెళ్లి గురించి మర్చిపో, అని ఒకే ఒక్క కండిషన్ పెట్టాను. ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో కానీ కొద్ది రోజుల తర్వాత సుమ వాళ్ళ నాన్న మా ఇంటికి వచ్చారు. మాట్లాడి వాళ్ళిద్దరికీ 1999వ సంవత్సరంలో పెళ్లి చేసామని దేవదాస్ కనకాల చెప్పుకొచ్చారు.పెళ్లి చేసుకున్నాక ఎక్కడో చోట భార్యాభర్తల మధ్య గొడవలు అనేది వస్తూ ఉంటాయి. మీ లైఫ్ లో వచ్చాయా? అనే ప్రశ్నకు బదిలిస్తూ.. “మా మధ్య గొడవలు చాలా వస్తాయి.

Also Read :  నాగచైతన్య నికర ఆస్తులు ఎన్ని వందల కోట్లో తెలుసా..?

వారంలో ఒకటి రెండు సార్లు వస్తూనే ఉంటాయి. ఇద్దరం ఒక రేంజ్ లో గొడవ పడతాం. ఆ తర్వాత మళ్లీ మామూలు అయిపోతాం. బాగా గొడవ జరిగినప్పుడు ఒక్కోసారి మాట్లాడుకోకుండా ఉన్న రోజులు కూడా ఉన్నాయి. ఇప్పటివరకు మేమిద్దరం మాట్లాడకుండా ఒక 15 రోజులు ఉన్నాం. మా ఇద్దరిలో ముందుగా కోపం వచ్చేది మా ఆయనకే. కాంప్రమైజ్ అయ్యేది కూడా ఆయనే. ఒక్కోసారి నా మిస్టేక్ ఉన్నప్పుడు నేను ముందు కాంప్రమైజ్ అవుతా. కానీ ఎక్కువసార్లు కాంప్రమైజ్ అయ్యేది మాత్రం తనే. నాకు రాజీవ్ లో అతని కోపం అంటే అసలు నచ్చదు. అతనిలో కోపం చాలా ఫాస్ట్ గా వస్తుంది. అంతే ఫాస్ట్ గా కు వెళ్తుంది. కానీ ఆ కోపం రావడమే ఒక రేంజ్ లో వస్తుంది. అది నాకు నచ్చదు. ఇక అంతకుమించి రాజీవ్లో నచ్చనిది ఏదైనా ఉందంటే టైమింగ్స్. నేను ఒక టైమింగ్ ఫిక్స్ చేస్తే రాజీవ్ దాన్ని ఇంకాస్త పొడిగిస్తాడు. ఈ విషయంలో కూడా మా మధ్య గొడవలు జరుగుతాయి” అంటూ చెప్పుకొచ్చింది సుమ.| Anchor Suma

నాలుగో ముడి

పెళ్లి సమయంలో తాళి కట్టేటప్పుడు రాజీవ్​మూడుముళ్లు వేశాక నాలుగో ముడి కూడా వేసేశాడని చెప్పింది సుమ. ఆడపడుచు వేయాల్సిన ముడిని కూడా ఆయనే వేసేశాడని తెలిపింది. ఎంతో కష్టపడి ప్రేమించాను కదా అందుకే ఆ ముడి కూడా నేనే వేస్తానుంటూ అలా చేశాడని చెప్పుకొచ్చింది. ఇంకా ఈ జంట ఈ పెళ్లి రోజు సందర్భంగా తమ యానివర్సరీని.. దగ్గర్లోని వృద్ధాశ్రమానికి వెళ్లి అక్కడే కేక్ కట్ చేసి జరుపుకుంది. అన్నదానం కూడా చేసింది.

చిన్న చిన్న తగాదాలు

ఇదిలా ఉండగా కొంతకాలం క్రితం వీరిద్దరూ విడిపోయారంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. వాటిపై స్పందించిన ఈ జంట.. ఎంత పెద్ద సెలబ్రిటీ కుటుంబంలో అయినా భార్యాభర్తల మధ్య చిన్న చిన్న తగాదాలు వస్తాయని.. కొంత కాలానికి అవి సమసిపోతాయని వెల్లడించారు. తమ మధ్య చిన్న గొడవలు జరిగిన మాటే వాస్తవమే అయినా మరీ అంత పెద్ద గొడవలు ఎప్పుడూ జరగలేదని క్లారిటీ ఇచ్చారు. వీరిద్దరూ చాలా అన్యోన్యంగా ఉన్నారని చెప్పడానికి ప్రస్తుతం సుమ షేర్ చేసిన ఓ వీడియోనే నిదర్శనం.| Anchor Suma

Anchor Suma

కొడుకు హీరోగా ఎంట్రీ

యాంకర్ సుమ కనకాల తనయుడు రోషన్ కనకాల హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. గతంలో నిర్మల కాన్వెంట్ అనే సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేశాడు రోషన్. ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. క్షణం, కృష్ణ అండ్ హిస్ లీల సినిమాలతో మెప్పించిన దర్శకుడు రవికాంత్ పేరెపు దర్శకత్వంలో రోషన్ కనకాల ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. తాజాగా రోషన్ కనకాల మొదటి సినిమా టైటిల్ ని రాజమౌళి లాంచ్ చేశారు.

Also Read : తిండి కోసం లారీలకు పెయింట్స్ వేసిన బ్రహ్మానందం..

రోషన్ కనకాల మొదటి సినిమా టైటిల్ ‘బబుల్ గమ్’ అని ప్రకటిస్తూ.. రాజమౌళి రోషన్ డెబ్యూట్ కి కంగ్రాట్స్ చెప్తూ సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. ఈ పోస్టర్ లో హీరో హీరోయిన్స్ హత్తుకొని ఉండగా హీరో నోట్లోంచి బబుల్ గమ్ తో బెలూన్ ఊదుతున్నాడు. రొమాంటిక్ లుక్ లో ఈ పోస్టర్ ఉంది. ఇక ఈ సినిమాలో మానస చౌదరి అనే తమిళమ్మాయి హీరోయిన్ గా నటిస్తుంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఈ సినిమా ఉంది. మరి రోషన్ కనకాల ఈ బబుల్ గమ్ తో ఎలా మెప్పిస్తాడా చూడాలి.

వివాదంలో సుమ

తాజాగా ఓ వివాదంలో చిక్కుకుంది. గతంలో సుమ చేసిన ఓ యాడ్ కారణంగా పలువురు సామాన్యులు ఇప్పుడు తీవ్రంగా నష్టపోయామంటూ వాపోతున్నారు. రాకీ అవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే వెంచర్‌కి సంబంధించిన యాడ్‌లో సుమ చెప్పినందుకే తాము ఫ్లాట్స్ కొన్నామని.. ఇప్పుడు పూర్తిగా మోసపోయామంటూ బాధితులు చెబుతున్నారు.రాకీ అవెన్యూస్ అనే సంస్థతో తాను 2016 నుంచి 2018 వరకు మాత్రమే ఒప్పందం చేసుకున్నానని.. ఆ సమయంలోనే వారికి సంబంధించిన ప్రమోషనల్ యాడ్ చేశానని సుమ క్లారిటీ ఇచ్చింది. అయితే, ఇప్పుడు ఆ సంస్థతో తనకు ఎలాంటి లావాదేవీలు, సంబంధం కానీ లేదని.. తనకు సంబంధించిన వీడియోను వారు అక్రమంగా వినియోగించుకున్నారని సుమ తెలిపింది.| Anchor Suma

అందుకే షో లు చేయడం లేదు

ఒకానొక సమయంలో సుమ పెద్ద ఎత్తున బుల్లితెర కార్యక్రమాలలో సందడి చేసేవారు కానీ ఇటీవల కాలంలో ఈమె ఒక షో మినహా మిగిలిన ఏ ఛానల్లో కూడా బుల్లితెర కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరించడం లేదు.ఇలా బుల్లితెర కార్యక్రమాలకు దూరమైనటువంటి సుమ సినిమా వేడుకలలో మాత్రం ఎంతో బిజీగా గడుపుతున్నారు.తాజాగా తన భర్త రాజీవ్ కొన్ని కామెంట్స్ చేశారు సుమ కెరియర్ పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ పిల్లలను మాత్రం ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదని 6 గంటలకల్లా ఇంటికి వచ్చేదని ఒకవేళ రానిపక్షంలో పిల్లలని కూడా తన వెంటే తీసుకు వెళ్లేదని ఈయన తెలిపారు.

పిల్లల్ని ఎప్పుడూ కూడా ఒంటరిగా ఫీల్ అయ్యేలా చేయలేదని రాజీవ్ తెలిపారు.ఇకపోతే ప్రస్తుతం ఈమె బుల్లితెర కార్యక్రమాలు పూర్తిగా తగ్గించేశారు.ఇలా తగ్గిపోవడానికి కారణం పిల్లలేనని తెలిపారు.మావి గవర్నమెంట్ ఉద్యోగాలు కాదు ఎప్పుడు ఎలాంటి పరిస్థితి వస్తుందో తెలియదు.అందుకే సుమ పిల్లలతో కలిసి యూట్యూబ్ ఛానల్ ప్రారంభించారు.ఇలా యూట్యూబ్ ఛానల్ ప్రారంభించడం వల్లే ఎక్కువ షోస్ చేయలేకపోతున్నారు అంటూ రాజీవ్ ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

సుమ రెమ్యునరేషన్

సుమ తన కెరియర్ మొత్తంలో కష్టపడి సంపాదించిన ఆస్తి అంతా కలిపి దాదాపు 100 కోట్లకు చేరువవుతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.సుమ యాంకరింగ్ చేస్తే ఆ ఈవెంట్ సూపర్ సక్సెస్ పక్కా. బట్ సుమతో యాంకరింగ్ అంటే అంత చిన్న విషయం కాదు. రెమ్యునరేషన్ లకారాల్లోనే ఉంటుంది. ఓ ఏడాది క్రితం సుమ రెమ్యునరేషన్ ఏమో కానీ.. ఇప్పుడు మాత్రం నాలుగు లకారాలు పైనేనట. అంటే అక్షరాల నాలుగు లక్షలు. తక్కువలో తక్కువ రెండు లక్షలు ఇస్తే కానీ ఈవెంట్ చేయదట.చిన్న సినిమానా పెద్ద సినిమానా అని కాదు.. నాలుగు లక్షలు రెమ్యునరేషన్ ఉంటేనే ఈవెంట్ మేనేజర్లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందట సుమ. అలాగని చివరి నిమిషంలో వచ్చి ఈవెంట్ చేయమంటే కుదరదు.. ఆమె డేట్స్ ముందే తీసుకోవాలి. కనీసం పది రోజులు ముందైనా డేట్ ఫిక్స్ చేసుకోవాలి.|Anchor Suma

సుమ మొదటి నుంచి కష్టపడింది అంతా స్థలాలు, ఇల్లులు, బంగారం , షేర్స్ పై పెట్టుబడులుగా మార్చేసిందట. ఇంచుమించు ప్రజెంట్ మార్కెట్ వాల్యూ ప్రకారం ఇవన్నీ కలగలిపితే దాదాపు 100 కోట్ల పై మాటగానే తెలుస్తుంది. అయితే యాంకర్ సుమ తన టోటల్ ఆస్తి మొత్తం తన ఇద్దరు బిడ్డలపైనే రాసుకొచ్చిందట. సుమ తర్వాత తన ఆస్తి మొత్తం తన కూతురు మనశ్విని, తన కొడుకు రోషన్ ఇద్దరికీ చెందాలని సుమ ముందుగానే దానికి తగ్గ పేపర్స్ ను రెడీ చేసుకుందట.రాజీవ్ కు ఒక్క రూపాయి చెందకుండా సుమ పకడ్బందీగా అగ్రిమెంట్ రాసిందట . గతంలో కూడా మనకు తెలిసిందే. గతంలో సుమ, రాజీవ్ కనకాల విడిపోతున్నారంటూ వార్తలు వినిపించాయి.| Anchor Suma

Leave a Comment