Actor Srihari | శ్రీహరి విజయవాడకు చెందిన శ్రీహరి కుటుంబం.. అతని చిన్నతనంలోనే హైదరాబాద్ లోని బాలానగర్ లో సెటిల్ అయ్యారు.మొదట విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను ప్రారంభించిన శ్రీహరి.. 100 కి పైగా సినిమాల్లో నటించి మెప్పించారు. హీరో ఆయన 28 సినిమాల్లో నటించారు. శ్రీహరి హీరోగా నటించిన చివరి సినిమా ‘పోలీస్ గేమ్’ .శ్రీహరి నటనతో ప్రేక్షకుల మనసులో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో అద్భుత పాత్రల్లో నటించారు శ్రీహరి. మగధీర సినిమాలో ఆయన పాత్ర సినిమాకే హైలైట్ అని చెప్పాలి.
శ్రీహరి గొప్పతనం
షేర్ ఖాన్ పాత్రలో తన గంభీరమైన గొంతుతో డైలాగులు చెప్పి ప్రేక్షకులను ఫిదా చేశారు. శ్రీహరి హీరోగా నటించిన కుబుసం, భద్రాచలం సినిమాలు మంచి విజయం సాధించాయి. అలాగే మంచు విష్ణు హీరోగా నటించిన ఢీ సినిమాలో తన నటనతో ఆకట్టుకున్నాడు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బృందావనం, ఢీ, కింగ్, మగధీర, తుఫాన్ చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు.2013 సంవత్సరం అక్టోబర్ నెల 9వ తేదీన ఆరోగ్య సమస్యల వల్ల శ్రీహరి మృతిచెందారు.
కొన్నివేల మందికి శ్రీహరి దానాలు చేశారని పృథ్వీ తెలిపారు. కష్టాల్లో ఉన్నామంటూ ఎవరైనా తన ఇంటి ముందుకు వస్తే శ్రీహరి డబ్బుకు రాయి కట్టి ఆ రాయికి గుడ్డ చుట్టి రోడ్డుపైకి విసిరేవారని పృథ్వీరాజ్ వెల్లడించారు. శ్రీహరి అలా డబ్బులు విసిరి ఆపదలో ఉన్నవాళ్ల కష్టాలు తీర్చేవారని పృథ్వీ పేర్కొన్నారు.కొన్ని సార్లు అయితే జూబ్లిహిల్స్ రోడ్ నంబర్ 45లోని ఆయన ఇంటి ముందు ఎవరైనా ఉంటే.. బాల్కనీ నుంచి డబ్బులో రాయి చుట్టు గుడ్డ కట్టి విసిరేవారు.. వాళ్లు అలా తీసి చూసుకొని ఆయనకు దండం పెట్టేవారు. కొన్ని వేల గుప్తదానాలు చేశారు అంటూ చెప్పుకొచ్చారు పృథ్వి.
అసలు ఆరోజు ఏం జరిగింది..
శ్రీ హరి చనిపోయిన రోజు రాజ్ కుమార్ సినిమా షూట్ కోసం ముంబై వెళ్లి హోటల్ లో దిగామని కాస్త ఒంట్లో నలతగా ఉందని చెప్పడంతో డాక్టర్‌కు ఫోన్ చేసి చెప్పామని ఆమె చెప్పింది. అయితే వచ్చిన డాక్టర్ ఏదో ఇంజెక్షన్ ఇచ్చాడని తాను ఫ్యామిలీ డాక్టర్‌ను అడిగి ఇంజెక్షన్ ఇవ్వమని చెప్పేలోపే ఇంజెక్షన్ ఇచ్చేశారని ఆమె చెప్పుకొచ్చింది. తాను నైటీలో ఉండటంతో లోపలికి వెళ్లి బట్టలు మార్చుకుని వచ్చేలోపే శ్రీహరిని లీలావతి హాస్పిటల్ తీసుకెళ్లారని, వెంటనే తాను కూడా ఆస్పత్రికి వెళ్లానని అయితే తను వెళ్ళే లోపలే ఆయన్ని ఐసీయూలో పెట్టారని, తనను కనీసం లోపలికి కూడా వెళ్లనివ్వలేదని చెబుతూ ఆమె భావోద్వేగానికి గుర్యయింది.
Also Read : యాంకర్ ఉదయభానుకి ఎంత మంది పిల్లలో తెలుసా..?
అయితే తాను దొంగతనంగా లోపలికి వెళ్లానని అయితే అప్పటికే శ్రేహరి రక్తంలో తడిసిపోయి ఉన్నాడని అది చూసి తాను గట్టిగా ఏడ్చేసానని దాంతో డాక్టర్లు తనను బలవంతంగా బయటికి పంపేశారని చెప్పుకొచ్చిందీమె. ఇక ఆరోజు రాత్రి 9.30 ప్రాంతంలో మరోసారి లోపలికి వెళ్లి చూసేసరికి డాక్టర్లు ఏదో తప్పు చేసారని అర్థమయిందని, తప్పు జరిగిందని బతిమాలుకుంటున్నట్లు అర్ధంయ్యిందని ఆమె చెప్పుకొచ్చింది. అయితే శ్రీ హరికి లివర్ సమస్య ఉందని అది తెలియక వీరు పైప్ నేరుగా పెట్టడంతో అది వెళ్లి లివర్ కి గుచ్చుకుని రక్తస్రావం అయ్యిందని ఆరోజున డాక్టర్లు చేసిన తప్పుకు శ్రీ హరి తనకే కాక ప్రపంచానికి కూడా దూరం అయ్యాడని ఆమె మళ్ళీ కన్నీళ్లు పెట్టుకున్నారు. అంటే డాక్టర్ లు చేసిన పొరపాటుకి ఆయన తనువు చాలించాడన్న మాట.
నా భర్తను మోసం చేశారు
తెరపై ప్రతినాయకుడిగా కనిపించిన శ్రీహరి.. నిజ జీవితంలో మాత్రం ఎందరికో సాయం చేశారు. తన భర్త ఎందరికో సాయం చేసి ఆదుకున్నారని.. కానీ ఆయన మరణం తర్వాత వారంత కనీసం పలకరించడానికి కూడా రాలేదని.. ఎదురుపడితే సాయం చేయాల్సి వస్తుందనే భయంతో ఏ ఒక్కరు తమను పలకరించలేదని ఆవేదన వ్యక్తం చేశారు శ్రీహరి (Srihari)భార్య శాంతి. అంతేకాకుండా శ్రీహరికి డబ్బులు ఇవ్వాల్సిన వారు కూడా ఆయన మరణించిన తర్వాత మళ్లీ కనిపించలేదని.. రెమ్యునరేషన్ కూడా రాలేదని.. కార్లు, నగలు అమ్మి అప్పులు తీర్చుకున్నామని ఓ ఇంటర్వ్యూలో
తెలిపారు శాంతి.కేవలం చిరంజీవిగారి సంస్థతోపాటు.. మరో రెండు మూడు సంస్థలే ఆయనకు సరిగ్గా రెమ్యునరేషన్ ఇచ్చేవాళ్లని అన్నారు. చాలా మంది డబ్బులు ఇవ్వకుండా శ్రీహరిని మోసం చేశారని తెలిపారు. ఆయనకు సినిమా అంటే పిచ్చి అని.. అందుకే డబ్బులు ఇవ్వకపోయిన పర్లేదు.. సినిమాలు చేయమని తాను చెప్పేదాన్ని అని అంటూ చెప్పుకొచ్చారు. శ్రీహరి చనిపోయిన తర్వాత చాలా మంది డబ్బులు ఇవ్వలేదని.. దీంతో ప్రస్తుతం తాము ఉంటున్న ఇంటిపై ఉన్న అప్పులను తీర్చడం కోసం నగలు, కార్లు అమ్మానని తెలిపారు.
హీరోగా శ్రీహరి తనయుడు
ఇదిలా ఉంటే శ్రీ హరి తనయుడు మేఘాంశ్ హీరోగా పరిచయం అయిన విషయం తెలిసిందే. ఈ కుర్రహీరో రాజ్ దూత్ అనే సినిమాతో హీరోగా అడుగు పెట్టాడు. ఆ సినిమా అంతగా ఆడలేదు .. కానీ మేఘాంశ్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇంకొంచం కష్టపడితే కుర్రాడు నిలబడతాడని అంతా చెప్పుకున్నారు. ఇక ఇప్పుడు కోతి కొమ్మచ్చి అనే సినిమాలో నటిస్తున్నాడు . ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సతీశ్ వేగేశ్న దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం టాలీవుడ్‌లో విభిన్నమైన కథలతో కుర్ర హీరోలు ఆకట్టుకుంటున్నారు. కథలో కొత్తదనం ఉంటే ఆ సినిమా తప్పకుండా హిట్ అవుతుంది. ఇప్పుడు అదే నమ్మకంతో ఈ రెండు సినిమాలను పాటలెక్కించాడు మేఘాంశ్. మరి ఈ యంగ్ హీరో ఈ సినిమాలతో ఏ స్థాయి హిట్స్ కొడతాడో చూడాలి.
శ్రీహరికి కూతురు
శ్రీహరికి ఇద్దరు కుమారులు ఉన్నారు అనే విషయం మనకు తెలుసు కానీ ఈయనకు ఒక కుమార్తె కూడా జన్మించారట అయితే ఆ చిన్నారి నాలుగు నెలల వయసులోనే మరణించారని తెలుస్తుంది.ఇలా శ్రీహరికి కుమార్తె జన్మించడంతో ఆ చిన్నారికి అక్షర అనే పేరు కూడా పెట్టారని అయితే ఆమె నాలుగు నెలల వయసులోనే చనిపోవడంతో తన కుమార్తెకు గుర్తుగా శ్రీహరి అక్షర ఫౌండేషన్ స్థాపించారని తాజాగా ఒక వార్త వైరల్ గా మారింది. ఈ విధంగా శ్రీహరి తన కుమార్తె అక్షర పేరు మీదట ఫౌండేషన్ స్థాపించి కొన్ని గ్రామాలలో అధికంగా ఫ్లోరైడ్ సమస్యతో బాధపడుతూ ఉండగా వారికి ఫ్లోరైడ్ రహిత నీటిని సరఫరా చేస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేశారట.
Also Read : ఒక్క ఈవెంట్‌కి యాంకర్ సుమ ఎన్ని లక్షలు తీసుకుంటుందో తెలుసా.
సినిమాల్లోకి రాకపోతే..
శ్రీహరి సినిమాల్లోకి రాక ముందు జిమ్నాస్టిక్స్‌లో రాష్ట్ర స్థాయి చాంపియన్ అయిన శ్రీహరి అథ్లెట్ అవ్వాలనుకున్నారు. జాతీయ స్థాయి జిమ్నాస్టిక్స్‌లో పాల్గొనాల్సి ఉన్నా.. సినిమాలపై మక్కువతో ఆయన ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. కాగా సినిమాల్లోకి రాక ముందు ‘మిస్టర్ హైదరాబాద్ గా ఏడుసార్లు అవార్డును సొంతం చేసుకున్నారు. ఏషియన్ గేమ్స్ లో భారతదేశం తరపున ఆడాలనే కోరిక ఉన్నా అది తీరలేదు.శ్రీహరి ఫ్యామిలీ సినిమాల్లోకి రాక ముందు పాల వ్యాపారం చేశారు.
హైదరాబాద్ లో శ్రీహరి కుటుంబం పాల బిజినెస్ అలాగే మెకానిక్ షెడ్ ద్వారా జీవనం సాగించేవారు. శ్రీహరి కూడా మెకానిక్ షెడ్ లో పని చేశారు. ఉదయం చదువుకుంటూ, సాయంత్రం శోభన థియేటర్ ఎదురుగా ఉన్న అన్న శ్రీనివాసరావు షెడ్డులో మెకానిక్ గా పనిచేస్తూ ఖాళీ దొరికిన సమయంలో సినిమాలు అదే థియేటర్ లో చూసేవాడు. శ్రీహరి ఇండస్ట్రీలో అవకాశాల కోసం ప్రయత్నాలు జరుపుతున్న సమయంలో దాసరి గుర్తించి బ్రహ్మనాయుడు సినిమాలో అవకాశం ఇచ్చారు.
ఆర్థిక పరిస్తితి..
శ్రీహరి మరణం తరువాత తమ ఆర్థిక స్థితి తలకిందులైందని, తాళి తప్ప ఇంకేమీ మిగల్లేదంటూ ఓ ఇంటర్వ్యూలో తాజాగా చెప్పుకొచ్చారు. తమను ఒక్కసారిగా అనేక సమస్యలు చుట్టుముట్టాయని డిస్కో శాంతి గుర్తుచేసుకున్నారు. భర్తను కోల్పోయిన దుఃఖంలో ఉన్న తాను కొందరి మోసం కారణంగా డబ్బు కూడా నష్టపోయానని.. ఆ డబ్బే ఉండి ఉంటే తన కుమారుడు చదువుకునేందుకు విదేశాలకు వెళ్లి ఉండేవాడని అన్నారు. తమ డబ్బు తిరిగిరాలేదు కానీ అప్పులిచ్చిన వాళ్లు మాత్రం ఇంటికి వచ్చారని చెప్పారు. |Actor Srihari
అప్పులు తీర్చేందుకు తమ వద్ద ఉన్న కార్లు, భూమి, బంగారం అన్నీ అమ్మేయాల్సి వచ్చిందని అన్నారు. శ్రీహరి కట్టిన తాళి తప్ప సర్వం కోల్పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. తమ రెండు ఇళ్లపై వస్తున్న అద్దెతోనే జీవితం నెట్టుకొస్తున్నామని చెప్పారు. రోడ్డు విస్తరణలో తమ జాగాలో కొంత భాగం కోల్పోయినందుకు ప్రభుత్వం ఇచ్చిన పరిహారాన్ని బ్యాంకులో వేశామని, దానిపైనా కొంత ఆదాయం వస్తోందని చెప్పారు.|Actor Srihari
300 కోట్లు వాళ్లకే
తన భర్త ఏకంగా 500 కోట్లు సంపాదించి పెట్టి వెళ్లిపోయాడు అంటూ కొన్ని మీడియా సంస్థలు రాసిన స్టోరీస్ చూసి బాధ పడ్డానని చెప్పింది ఈమె. నిజంగానే శ్రీహరి తనకు 500 కోట్ల ఆస్తులను ఇచ్చాడని నిరూపిస్తే.. అందులో 300 కోట్లు వాళ్లకే ఇచ్చేస్తానంటూ ఓపెన్ ఆఫర్ ఇచ్చింది ఈమె. తన భర్త చనిపోయిన తర్వాత తమ కుటుంబం ఎలాంటి లోటు లేకుండా బతకడానికి కారణం తన ఆస్తులను తాకట్టు పెట్టడమే అని సంచలన విషయాలు బయటపెట్టింది డిస్కో శాంతి.కానీ ఆ విషయం తెలియకుండా ఇష్టమొచ్చినట్లు మాట్లాడుకుంటున్నారంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.|Actor Srihari
శ్రీహరి రెండుసార్లు వివాహం
నిజానికి డిస్కో శాంతిని.. శ్రీహరి రెండుసార్లు వివాహం చేసుకున్నారు. 1991లో నాగబాబు హీరోగా తెరకెక్కిన దాదల్ ఎక్స్‌ప్రెస్ సినిమా షూటింగ్ టైంలో.. శాంతితో శ్రీహరికి పరిచయం ఏర్పడింది. ఆ సినిమాలో శ్రీహరి విలన్ గా చేస్తే.. శాంతి స్పెషల్ సాంగ్లో మెరిశారు. అయితే షూటింగ్ టైంలో శాంతి మంచితనం.. శ్రీహరిని ఎంతోగానో ఆకట్టుకున్నాయి. దాంతో శ్రీహరి ఒకరోజు నేరుగా వెళ్లి పెళ్లి చేసుకుంటానని చెప్పారట. ముందు డిస్కో శాంతి ఎలాంటి సమాధానం ఇవ్వకపోయినా.. కొద్ది రోజులకు శ్రీహరి ప్రేమను అంగీకరించింది.|Actor Srihari
1992లో చెన్నైలో ఒక గుడికి వెళ్లారు. అక్కడ ఒక పూజారి వారిద్దరి జాతకాలు చూసి ఈ ఏడాది మీరు పెళ్లి చేసుకోకపోతే జీవితంలో ఒక్కటి కాలేరని చెప్పారట. వెంటనే శ్రీహరి అదే గుడిలో శాంతి మెడలో మూడు ముళ్ళు వేసేశారు.ఆ తర్వాత డిస్కో శాంతి తన చెల్లెళ్లకు, తమ్ముళ్లకు పెళ్లి చేసి సెటిల్ అవ్వాలని భావించింది. ఇక 1996లో అధికారికంగా రెండోసారి శ్రీహరితో ఏడడుగులు వేసింది. పెళ్లి తర్వాత డిస్కో శాంతి ఇండస్ట్రీకి దూరమైంది.|Actor Srihari