Akkineni Nagarjuna | టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న కుటుంబాలలో దగ్గుబాటి కుటుంబం, అక్కినేని కుటుంబం ఒకటి అని చెప్పాలి. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఈ రెండు కుటుంబాలు కూడా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఇక అక్కినేని కుటుంబంలో నాగార్జున ఆయన కుమారులు వారసులుగా కొనసాగుతూ ఉండగా, దగ్గుబాటి కుటుంబంలో సురేష్ బాబు నిర్మాతగా వ్యవహరించగా, వెంకటేష్, రానా హీరోలుగా కొనసాగుతున్నారు. ఇలా ఇండస్ట్రీలో ఎంతో పేరు, ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈ రెండు కుటుంబాల మధ్య బంధుత్వం కూడా ఉన్న సంగతి తెలిసిందే.
నాగార్జున మొదటి భార్య పేరు
దగ్గుబాటి కుటుంబం సంగతి కాసేపు పక్కన పెడితే సినీ ఇండస్ట్రీలోకి అక్కినేని వారసుడిగా అడుగు పెట్టిన నాగార్జున చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు .విక్రమ్ అనే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన నాగార్జున చాలా తక్కువ సమయం లోనే మన్మధుడిగా, హీరోగా, కింగ్ నాగార్జున గా పాపులారిటీని దక్కించుకున్నాడు.. ప్రస్తుతం ఒకవైపు సినిమాలు మరొకవైపు బుల్లితెర షోలకు హోస్ట్ గా వ్యవహరిస్తూ బిజీగా ఉన్నాడు నాగార్జున .ఇక అప్పుడప్పుడు వాణిజ్య ప్రకటన లలో కూడా నటిస్తూ మంచి లాభాలను పొందుతున్నాడు నాగార్జున.ఇదిలా ఉంటే ప్రస్తుతం.. నాగార్జున భార్య అమల.. నాగార్జున కు రెండవ భార్య అన్న విషయం ఇప్పటికీ కొంతమంది తెలుగు ప్రేక్షకులకు తెలియదు.
అక్కినేని అఖిల్ నాగార్జున అమల దంపతులకు జన్మించాడు. కానీ అక్కినేని నాగచైతన్య మాత్రం నాగార్జున మొదటి భార్యకు జన్మించాడు. అయితే నాగార్జున మొదటి భార్య సీనియర్ హీరో వెంకటేష్ సోదరి లక్ష్మి. మొదట వీరిద్దరికీ అంగరంగ వైభవంగా పెళ్ళి జరిగింది. ఆ తర్వాత వీరిద్దరూ వివిధ కారణాలతో విడాకులు తీసుకుని విడిపోయారు. లక్ష్మి చిన్నప్పటినుండి అమెరికాలో పెరగడంతో పాటు అక్కడే చదువుకుంది. రామానాయుడు ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో అక్కినేని నాగేశ్వరరావు తో మంచి అనుబంధం ఏర్పడడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక ఆ క్రమంలోనే తన కూతురు లక్ష్మిని నాగార్జునకి ఇచ్చి పెళ్లి జరిపించారు.
ఈ క్రమంలోనే అమెరికాలో ఉన్న లక్ష్మీని పిలిపించి చెన్నైలో ఇద్దరికి వివాహం జరిపించడం జరిగింది. అలా ఇద్దరికీ వివాహం జరిగిన తర్వాత నాగచైతన్య జన్మించాడు. పెళ్లి తర్వాత లక్ష్మి ఇండియాలో ఉండడానికి ఇబ్బంది పడ్డారట. దాంతో అమెరికాకు వెళ్లిపోయిందని అక్కడే స్థిరపడదామని నాగార్జునతో చెప్పిందట. ఆయన సినిమాలలో బిజీగా ఉండడం వల్ల కుదరలేదని దాంతో ఇద్దరి మధ్య గొడవలు ఏర్పడి విడాకులు తీసుకున్నారని ఇక అదే సమయంలో తనతో నటిస్తున్న అమలతో పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారి వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది .
ఆ హీరోతో ప్రేమలో అమల
అయితే అమల నాగార్జున కంటే ముందు ఓ హీరోను ప్రేమించారనే వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది.తమిళ హీరో కార్తీక్‌తో అమలా ప్రేమలో పడ్డారనే వార్తలు అప్పట్లో బాగా వినిపించాయి. హీరో కార్తీక్, అమల ఇద్దరు ప్రేమించుకున్నారని తమిళ ఇండస్ట్రీలో టాక్ వినిపించింది. వీరిద్దరు ‘ఘర్షణ’ అనే మూవీలో కలిసి నటించారు. ఆ సినిమా షూటింగ్లో ఏర్పడిన పరిచియం ప్రేమగా మారిందని తెలుస్తోంది. అయితే వీరిద్దరి మధ్య ఉన్న ప్రేమాయణం ఎక్కువ మందికి తెలియదట.కేవలం అమల,కార్తిక్ దగ్గరి సన్నిహితులకు మాత్రమే తెలుసట. అయితే ఏం జరిగిందో తెలియదు కానీ వీరిద్దరు విడిపోయారు. ఆ తర్వాత అమల తమిళ ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పిన ఆమె తెలుగు ఇండస్ట్రీకి వచ్చేశారు. తెలుగు ఇండస్ట్రీలో అప్పటి యువ హీరో నాగార్జునతో ప్రేమలో పడి ఆయన్ని వివాహం చేసుకున్నారు.
Also Read : ఇంటికి వెళ్లి కీర్తి సురేష్ ని పెళ్లి చేసుకోమని అడిగింది ఎవరో తెలుసా..?
నాగార్జున అమల ప్రేమ..
అక్కినేని నాగార్జున అమల దంపతుల గురించి చెప్పాల్సిన పనిలేదు. వీరిద్దరూ కూడా మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనేలాగే ఉన్నారు. నాగార్జున – అమల కలిసి ‘ప్రేమ యుద్ధం’, ‘శివ’, ‘కిరాయి దాదా’, ‘నిర్ణయం’, ‘చినబాబు’ సినిమాల్లో నటించారు. 1992 జూన్ 11న ఆర్యసమాజ్‌లో పెళ్లి చేసుకున్నారు. ఇకపోతే ఒక ఇంటర్వ్యూలో నాగార్జున అమల ఇద్దరు పాల్గొన్నారు. ఈ క్రమంలోనే పెళ్లి సమయంలో అమల అక్కినేని ఇంటికి తీసుకువచ్చిన కట్న కానుకల గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి.అక్కినేని ఇంటికి కట్నంగా ఏం తీసుకువచ్చింది అంటూ ప్రశ్న ఎదురవడంతో నాగార్జున సమాధానం చెబుతూ పలు విషయాలు తెలియజేశారు.
సాధారణంగా సినిమా సెలబ్రిటీలు కట్న కానుకలు అంటే భారీ స్థాయిలోనే ఉంటాయనే సంగతి మనకు తెలిసిందే. కానీ అమల కట్నం గా తన పెళ్లి సమయంలో తన ఇంటికి రెండు కుక్కపిల్లలను తీసుకువచ్చింది అంటూ నాగార్జున తెలిపారు.ఈ విధంగా నాగార్జున (Nagarjuna) తన కట్నం విషయంలో చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. మరి నాగార్జున నిజంగానే అమల కట్నంగా కుక్క పిల్లలను తీసుకువచ్చిందని చెప్పారా లేకపోతే అమలకు జంతువులు అంటే ఇష్టం అని అలా చెప్పారా అనే విషయం తెలియదు కానీ ఈయన చేసినటువంటి కామెంట్స్ మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
నిఖిత అని పేరు ఫిక్స్
నాగార్జున ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నేనైతే ఆడపిల్ల పుట్టాలని కోరుకున్నా. అమల డెలివరీకి ఇంకా 6 నెలల సమయం ఉండగా యుఎస్ పంపించేశా. అక్కడ ట్రీట్మెంట్ బావుంటుంది.. వాకింగ్ కూడా ఫ్రీగా చేయొచ్చు అనే ఉద్దేశంతో పంపించినట్లు నాగార్జున తెలిపారు. అఖిల్ జన్మించింది యుఎస్ లోనే. అక్కడ యుఎస్ లో డాక్టర్లు స్కానింగ్ చేసి ఆడపిల్ల అని చెప్పారు. నేనైతే ఎగిరి గంతేశా.. నాకు ఆడపిల్ల పుడుతోందని. అమ్మాయికి నిఖిత అని పేరు కూడా ఫిక్స్ చేశా. రిటర్న్ టికెట్ నిఖిత పేరు మీద బుక్ చేశా.
Also Read : నన్ను చూసిన రోజే మనం పెళ్లి చేసుకుందాం అని ఎన్టీఆర్ నన్నడిగారు… లక్ష్మీ పార్వతి
అమ్మాయిల డ్రెస్సులు కూడా కొన్నా. డెలివరీకి రెండు రోజుల ముందు అమల చెప్పింది. మనకి పుట్టబోయేది అబ్బాయే.. నువ్వు ఫిక్స్ అయిపో అని చెప్పింది. అదేంటి అని అడిగా. నాకు కలలో తెలిసింది అని చెప్పింది. నేను డాక్టర్లు చెప్పారు కదా అమ్మాయి పుడుతుందని.. అమ్మాయే పుడుతుందని నమ్మకంతో ఉన్నా. కానీ డెలివరీ తర్వాత చూస్తే అబ్బాయి. నేను షాక్ అయ్యా. డాక్టర్లు ఎందుకు చీట్ చేశారు.. ఎక్కడ తప్పు జరిగింది అని ఆరా తీస్తే.. స్కానింగ్ రిపోర్ట్ లో కూడా తప్పు రావడానికి 5 శాతం ఛాన్స్ ఉందని చెప్పారు.
నాగ చైతన్య సామ్ ల పెళ్లి
నాగార్జున పెద్ద కొడుకు నాగ చైతన్య. జోష్ సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యాడు. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. ఆ తరువాత ఏ మాయ చేసావే సినిమాతో చై.. హీరోగా మంచి విజయాన్ని అందుకున్నాడు. కొడుకులను హీరోలుగా నిలబెట్టడానికి నాగార్జున పడే కష్టం దేవుడికే తెలియాలి.ఇక చై -సామ్ ల పెళ్లిని నాగార్జున దగ్గరుండి ఎంతో గ్రాండ్ గా జరిపించాడు. రెండు రోజులు.. రెండు విభిన్నమైన సంప్రదాయాల మధ్య వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. సమంత వచ్చాక తనకు కూతురు లేని లోటు పోయిందని నాగ్ చెప్పుకొచ్చాడు. కానీ, సమంత- నాగ చైతన్య నాలుగేళ్లు నిండకుండానే విడాకులు తీసుకున్నారు.
ఫ్యామిలీ ఫోటో చూశారా..
తాజాగా అక్కినేని ఫ్యామిలీ అంతా ఒకేచోట కలిసి కనపడి అభిమానులకు ట్రీట్ ఇచ్చారు. నిన్న అక్కినేని నాగేశ్వరరావు 100వ జయంతి కావడంతో పలు వేడుకలు నిర్వహించారు.ఈ క్రమంలో అక్కినేని ఫ్యామిలీ ఉదయం అన్నపూర్ణ స్టూడియోస్ లో ఏఎన్నార్ 100వ జయంతి వేడుకలు నిర్వహించారు. అనంతరం సాయంత్రం ఏఎన్నార్ ఫిలిం ఫెస్టివల్, పోస్టల్ స్టాంప్ రిలీజ్, ఏఎన్నార్ శతజయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి అనేకమంది సినీ, రాజకీయ ప్రముఖులు, పలువురు అభిమానులు హాజరయ్యారు.ఈ ఈవెంట్ కి అక్కినేని ఫ్యామిలీ అంతా కూడా వచ్చారు. అక్కినేని వెంకట్, నాగార్జున, నాగ సుశీల, అమల, నాగ చైతన్య, సుప్రియ, అఖిల్, సుమంత్, సుశాంత్, అక్కినేని మనవళ్లు, మనవరాళ్లు.. ఇలా ఫ్యామిలీ మొత్తం ఈ ఈవెంట్ కి హాజరైంది. దీంతో అక్కినేని అభిమానుల కోసం ఫ్యామిలీ అంతా కలిసి ఫొటోలు దిగారు. అలాగే అక్కినేని వారసులు, అక్కినేని హీరోలు కూడా కలిసి ఫొటోలు దిగారు. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ గా మారాయి. ఫ్యామిలీ అందర్నీ ఒకే చోట చూసి అక్కినేని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఈ మధ్య అక్కినేని కుటుంబాన్ని కుదిపేసిన వార్త N కన్వెన్షన్ కూల్చివేత. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. N కన్వెన్షన్ ను చెరువును కబ్జా చేసి కట్టారని దాన్ని కూల్చివేసిన విషయం తెల్సిందే. ఆ సమయంలో కూడా నాగ్ ఎంతో సమన్వయం పాటిస్తూ.. “మేము ఏ చెరువును కూల్చలేదు.. ఈ సమస్య విషయమై గౌరవ హైకోర్టుని ఆశ్రయించటం జరిగింది. న్యాయస్థానం తీర్పు కి నేను కట్టుబడి ఉంటాను. అప్పటి వరకు, ఊహాగానాలు, ఎలాంటి పుకార్లు, అవాస్తవాలు నమ్మవద్దని నేను మిమ్మల్ని సవినయంగా అభ్యర్ధిస్తున్నాను” అని చెప్పి సైలెంట్ అయ్యాడు.
రూ.100 కోట్ల పరువునష్టం దావా
అక్కినేని నాగార్జున ఫ్యామిలీపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. టాలీవుడ్ అగ్ర నటి సమంతతో పాటు, అక్కినేని కుటుంబంపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు సినీ ఇండస్ట్రీలో దూమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై ఇప్పటికే సమంతకు నాగార్జునకు పలువురు మద్దతుగా నిలిచారు.ఇదిలావుంటే ఫిలిం ఇండస్ట్రీ సమాచారం ప్రకారం.. కొండా సురేఖ విషయంలో నాగార్జున చాలా సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తుంది.
తన కుటుంబ పరువుకు భంగం కలిగించినందుకు నాగార్జున మంత్రి కొండా సురేఖపై రూ.100 కోట్ల పరువునష్టం దావా వేయనున్నట్లు తెలుస్తుంది.తన కుటుంబ పరువుకు భంగం కలిగించారని.. తమ కుంటుంబ సభ్యుల గౌరవాన్ని, ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఆమె వ్యాఖ్యలు చేశారంటూ పిటిషన్ దాఖలు చేశారు. మంత్రి కొండాసురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని నాంపల్లి కోర్టును ఆశ్రయించారు.
అయితే ఈ పిటిషన్ నేడు విచారణకు రాగా.. నాంపల్లి మనోరంజన్ కోర్టు సోమవారానికి వాయిదా వేసింది. న్యాయమూర్తి సెలవులో ఉన్న నేపథ్యంలో కేసును వాయిదా వేస్తూ.. సోమవారం విచారణ చేపట్టనున్నట్లు మనోరంజన్ కోర్టు ప్రకటించింది.దీనిపై ఇప్పటికే సోషల్ మీడియాల్లో వార్తలు వస్తున్నాయి. కాగా.. దీనిపై నాగార్జున అధికారికంగా స్పందించాల్సి ఉంది.