Keerthy Suresh | ఇంటికి వెళ్లి కీర్తి సురేష్ ని పెళ్లి చేసుకోమని అడిగింది ఎవరో తెలుసా..?

Keerthy Suresh | మహానటి కీర్తి సురేష్ ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆమె తన అందం, అభినయంతో అభిమానులను కూడా ఆకట్టుకుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఊహించని స్థాయిలో క్రేజ్ కలిగి ఉన్న హీరోయిన్లలో కీర్తి సురేష్ ఒకరు. కీర్తి సురేష్ కి మొదట్లో పెద్ద పేరు రాకపోయినా కూడా.. మహానటి సినిమాతో ఆమెకు మంచి పేరు వచ్చింది. అక్కడి నుంచి ఆమెకు మంచి అవకాశాలు కూడా వచ్చాయి. అలాగే మహానటి సినిమాకి ముందు టాలీవుడ్ లో నటించిన కొన్ని సినిమాలు ఆమెకు మంచి పేరును తెచ్చాయి. నేను శైలజ సినిమాలోకీర్తి సురేష్ నటన, ఆమె ముఖారవిందము తెలుగు ఆడియన్స్ కి ఎంతగానో నచ్చింది.

కీర్తి సురేష్ వాళ్ళ అమ్మ

అలాగే నానితో కలిసి నటించిన నేను లోకల్ సినిమాలో కూడా ఆమె నటన బాగుంది. ఆ సినిమా కూడా హిట్ అయ్యింది. కాకపోతే టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవితో ఆమె నటించిన భోళా శంకర్ మాత్రం ఫ్లాప్ అవ్వడం విశేషం. అయినా కూడా టాలీవుడ్ లో మాత్రం ఆమెకు మంచి పేరు ఉంది.మరోవైపు కీర్తి సురేష్ సైరన్ అనే సినిమాలో నటించగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాలో కీర్తి సురేష్ పోలీస్ ఆఫీసర్ రోల్ లో కనిపించనున్నారు.ఇదిలా ఉంటే కీర్తి సురేష్ టాలీవుడ్ లో ఒక స్టార్ హీరో కొడుకుకి అత్త అవుతుందట. కొన్ని రోజుల క్రితం ఒక ఇంటర్వ్యూలో కీర్తి సురేష్ నే స్వయంగా ఈ విషయాన్ని పంచుకుంది. ఇంతకీ కీర్తిని అత్త అని పిలిచెదెవరో తెలుసా న్యాచురల్ స్టార్ నాని కుమారుడు అర్జున్ అలియాస్ జున్ను(ముద్దు పేరు).

Also Read :  నన్ను చూసిన రోజే మనం పెళ్లి చేసుకుందాం అని ఎన్టీఆర్ నన్నడిగారు… లక్ష్మీ పార్వతి

ఒక సినిమా ప్రమోషన్ లో భాగంగా మాట్లాడిన మహానటి నాని, అతని కుటుంబ సభ్యులతో తనకున్న అనుబంధాన్ని ఇలా షేర్ చేసుకుంది.‘నాని కొడుకు జున్ను( నాని కొడుకు ముద్దు పేరు) నా స్ట్రెస్ బస్టర్. జున్ను నన్ను కీర్తి అత్త అని పిలుస్తాడు. వాడి క్యూట్ నెస్ చూస్తే నాకు చాలా ముచ్చటేస్తుంటుంది. జున్ను చాలా తొందరగా పెరుగుతున్నాడు. నేను హైదరాబాద్ కి వస్తే కచ్చితంగా జున్నుని కలిసే వెళ్తాను. ఇంక వాడి వాయిస్ మెసేజెస్ తరూ వింటూ ఉంటాను. నాకు బర్త్ డే విషెష్ కూడా చాలా క్యూట్ గా చెప్పాడు. హ్యాపీ బర్త్ డే కిట్టి అత్త అని జున్ను చెప్పిన మాటలు నేను ఎప్పటికీ మర్చిపోలేను’ అని చెప్పుకొచ్చింది కీర్తి.మరో పక్క టాలీవుడ్లోనే కాకుండా బాలీవుడ్లో కూడా ఎన్నో మూవీస్ లో నటిస్తుంది ఈ ముద్దుగుమ్మ.

Keerthy Suresh

రీసెంట్ గా చిరంజీవి సరసున చెల్లెలి క్యారెక్టర్ చేసింది ఈ అమ్మడు. వాల్తేరు వీరయ్య మూవీలో చెల్లెలు క్యారెక్టర్ లో చేసింది ఈ ముద్దుగుమ్మ. ఇటీవల రఘుతాత చిత్రంలో ప్రేక్షకులను పలకరించిన ప్రముఖ కథనాయిక కీర్తి సురేష్ ప్రస్తుతం తెలుగులోనే నటిస్తున సినిమా ఏది సెట్స్ మీద లేదు. ఒకప్పుడు తెలుగులో కూడా చేతినిండా సినిమాలతో బిజీగా వున్న కీర్తికి వరుస ఫ్లాపులు రావటంతో టాలీవుడ్ లో కాస్త జోరు తగ్గింది.ఇక ‘మహానటి’ చిత్రంలో ఉత్తమ నటనకు జాతీయ పురస్కారం అందుకున్న ఈ బ్యూటీ హవా ఇప్పుడు బాలీవుడ్ లో కొనసాగుతోంది. ప్రస్తుతం బాలీవుడ్లో వరుణ్ ధావన్ సరసన బేబీ జాన్ అనే సినిమాలో నటిస్తుంది కీర్తి సురేష్. ఈ చిత్రానికి జవాన్ దర్శకుడు, కీర్తి సురేష్ స్నేహితుడు అట్లీ కూడా నిర్మాతగా వహిస్తున్నాడు.

ఇదిలా ఉంటే కీర్తి ఎంత సంపాదించిందో తెలుసా.? ఒక్కో సినిమాకు నాలుగైదు కోట్ల పారితోషికం తీసుకునే కీర్తి సురేష్ 2023లో కేవలం సినిమాల నుంచే దాదాపు 25 కోట్లు అందుకుంది. చాలా మంది స్టార్ నటులతో పోలిస్తే ఇది చాలా తక్కువే. అయితే కీర్తి సురేష్ సినిమాలతోనే కాదు. కీర్తి సురేష్ కొన్ని ప్రకటనలు, వ్యాపారం, రియల్ ఎస్టేట్ ద్వారా డబ్బు సంపాదిస్తుంది. కీర్తి సురేష్ 2023లో దాదాపు 120 కోట్లుసంపాదించిందని తెలుస్తోంది. కీర్తి సురేష్‌కి ఓ కాస్ట్లీ ఇల్లు ఉంది.

కంటతడి పెట్టిస్తున్న కీర్తి సురేష్

కిర్తి సురేష్ ప్రాణ స్నేహితురాలు మనీషా రీసెంట్ గా బ్రెయిన్ ట్యూమర్ తో చనిపోయింది. ఇదే విషయాన్ని ఆమె పుట్టిన సందర్భంగా గుర్తు చేసుకుంటూ సుదీర్ఘ పోస్టు పెట్టింది. ఆమెతో తనకున్న అనుబంధం, చనిపోయే ముందు తను పడిన బాధ గురించి రాసుకొచ్చింది. “గత కొన్ని వారాలుగా నేను ఎంతో బాధను అనుభవిస్తున్నాను. నా చిన్ననాటి స్నేహితురాలు ఇంత త్వరగా మమ్మల్ని విడిచిపెట్టి వెళ్లడం నమ్మశక్యంగా లేదు. 21 ఏళ్ల వయసులోనే తీవ్రమైన బ్రెయిన్ ట్యూమర్‌ కు గురైంది. దాదాపు 8 ఏళ్ల పాటు వ్యాధితో పోరాడింది. గత నవంబర్‌ లో ఆమెకు మూడో సర్జరీ జరిగింది. ఆ సమయంలోనూ తను ధైర్యంగానే ఉంది. కానీ, ఆ సమయంలో తను నొప్పి భరించలేకపోతున్నట్లు నాతో చెప్పి కంటతడి పెట్టింది. ఆమె బాధ ఇప్పటికీ నా కళ్ల ముందు కదలాడుతూనే ఉంది. రోజు రోజుకు ఆమె ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. ఆమె అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు చివరిసారిగా చూశాను. ఆ బాధను పంచుకోలేకపోతున్నాను” అని కీర్తి రాసుకొచ్చింది.

Also Read : ప్రతిరోజూ అల్లం తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..

కీర్తి సురేష్ రెమ్యునరేషన్

కీర్తి సురేష్ రెమ్యునరేషన్ 2 నుంచి 3 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది. కీర్తి సురేష్ కు మునుపటి లుక్ వచ్చిందని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. కీర్తి సురేష్ స్లిమ్ లుక్ కంటే బొద్దుగానే బాగుంటారని కొంతమంది ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.కీర్తి సురేష్ ఎంతో కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నారు.\

ఇంటికి వెళ్లి మరి పెళ్లి..

కీర్తి సురేష్ ఒక రోజుని ఎప్పటికీ మర్చిపోలేనని చెప్పుకుంటూ వచ్చింది. తన ఇంటి బెల్ ఒకరోజు రింగ్ అయిందని, తీరా వెళ్లి చూస్తే గుమ్మంలో ఒక అభిమాని వచ్చి.. నన్ను పెళ్లి చేసుకుంటారా అని అడిగాడని చెప్పింది. అతనికి నేనంటే పిచ్చి ఇష్టం. ఆ ఇష్టంతోనే అంత ధైర్యం చేసి వచ్చి.. నన్ను డైరెక్ట్గా నా ముఖం మీద పెళ్లి గురించి అడిగాడని చెప్పింది. ఆరోజు నేను ఎప్పటికీ మర్చిపోలేను. అది నాకు క్రేజీ ఫ్యాన్ మూమెంట్ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం కీర్తి సురేష్ చేతిలో రెండు బాలీవుడ్ సినిమాలు ఉన్నాయి. అలాగే రఘు తాత సినిమాలో కూడా కీర్తి సురేష్ నటిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే.

Keerthy Suresh

కీర్తి సురేష్ ఫస్ట్‌ రెమ్యునరేషన్‌

కీర్తి.. తన తొలి సినిమాకు ఎంత తీసుకుందో తెలిస్తే షాక్‌ అవుతారు. కీర్తి చిన్నప్పటి నుంచే సినిమాలు చేసింది. బాలనటిగా మలయాళంలో మూడు సినిమాలు చేసింది. కాగా బాలనటిగా కీర్తి సురేష్‌ తొలి పారితోషికం రూ.500 అట. ఈ విషయాన్ని స్వయంగా కీర్తి సురేష్‌ తండ్రి సురేష్ కుమార్‌ వెల్లడించాడు.తండ్రి ప్రొడ్యూసర్‌, తల్లి నటి ఇలా కీర్తి తల్లిదండ్రులిద్దరూ సినీ రంగానికి చెందిన వారు కావడంతో ఆమె సినీ పరిశ్రమలోకి రావడం చాలా తేలికైంది.

కానీ తన నటన, అభినయంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. కాగా కీర్తి తొలిసారి 2000లో పైలట్స్‌ అనే సినిమాలో కెమెరా ముందుకు వచ్చింది. ఈ సినిమాను నిర్మించింది కీర్తి సురేష్‌ తండ్రే. కాగా ఈ సినిమాలో నటించినందుకు సురేష్‌.. కీర్తికు 500 ఇచ్చాడట. ఆ తర్వాత చైల్డ్‌ ఆర్టిస్టుగా చేసిన రెండు సినిమాలు కూడా కీర్తి సురేష్‌ తండ్రి ప్రొడ్యూస్‌ చేసినవే. ఇక ప్రస్తుతం కీర్తి ఒక్కో సినిమాను 2 నుంచి 3 కోట్ల రేంజ్‌లో పారితోషికం తీసుకుంటుందట.

ఒంగోలులో సందడి చేసిన కీర్తి

ఒంగోలు లో హీరోయిన్ కీర్తి సురేశ్ సందడి చేశారు. ఒంగోలులో నూతనంగా ఏర్పాటు చేసిన చెన్నై షాపింగ్ మాల్‌ను కీర్తి సురేశ్ ప్రారంభించారు. అక్కడి చీర్ల కలెక్షన్లను ఆమె పరిశీలించి ప్రదర్శించారు. షో రూమ్‌ను ప్రారంభించడం సంతోషంగా ఉందని కీర్తి చెప్పారు. ఇక్కడ చాలా కలెక్షన్లు ఉన్నాయని, పండగల షాపింగ్‌కు చెన్నై షాపింగ్ మాల్‍కు రావాలని కీర్తి సురేశ్ కోరారు. హీరోయిన్‌ను చూసేందుకు అభిమానులు పెద్దసంఖ్యలో షాపింగ్ మాల్‌కు తరలివచ్చారు.

ఛీ కొడుతున్న నెటిజన్స్

నిజానికి బొద్దుగా ఉన్నప్పుడే కీర్తి సురేష్ చాలా అందంగా ఉండేది.ఇక ఇదంతా పక్కన పెడితే తాజాగా తను తన సోషల్ మీడియా( Social media ) వేదికగా కొన్ని ఫొటోస్ పంచుకుంది.అందులో తన అవుట్ ఫిట్ తో అందర్నీ బాగా ఆకట్టుకుంది.అయితే తన అవుట్ ఫిట్ పైభాగం ఓపెన్ గా ఉండటంతో నెటిజన్స్ బాగా ఫైర్ అవుతున్నారు.మొదట్లో ఎంత పద్ధతిగా ఉండే దానివి ఇప్పుడు ఇలా తయారయ్యావు అంటూ కామెంట్లు పెడుతున్నారు.రోజురోజుకి ఇలా బరితెగిస్తున్నావ్ ఏంటి అంటూ ఛీ కొడుతున్నారు.ఇప్పటికైనా నువ్వు మారితేనే మంచిది.లేదంటే నీ మీద ఉన్న అభిమానం మొత్తం పోతుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.

కీర్తి సురేష్ పెళ్లి..

కొద్ది రోజులుగా కీర్తి సురేష్ త‌న చైల్డ్ హుడ్ ఫ్రెండ్‌తో ఏడ‌డుగులు వేయ‌నుందంటూ అనేక ప్ర‌చారాలు సాగాయి. వీరిద్దరు గత కొంతకాలంగా రిలేషన్‌లో ఉన్నారని, త్వరలోనే వీరు పెళ్లి చేసుకోబోతున్నారంటూ ప్ర‌చారం జ‌రిగింది. ఆ ప్ర‌చారాల‌పై కీర్తి తాజాగా స్పందించింది.సోషల్ మీడియాలో నా గురించి వైరల్ అవుతున్న రూమర్స్‌పై క్లారిటీ ఇస్తే అవి నిజమనే నమ్ముతారు. అందుకే అలాంటి రూమర్స్‌పై నేను స్పందించనంటూ కీర్తి చెప్పుకొచ్చింది.

కేవలం నా సినిమాల ఎంపిక.. నటనపై విమర్శలు చేస్తే తప్పకుండా స్వీకరిస్తాను. ఇక నా వ్యక్తిగత జీవితం.. ఫ్యామిలీ గురించి ఎవరైనా కామెంట్స్ చేసినా కూడా నేను ఏ మాత్రం పట్టించుకోను.. వాళ్ల వ్యక్తిగత కారణాలతో చేసే కామెంట్స్ సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం నాకు లేదు అంటూ తన పెళ్లి వార్తలను కొట్టిపారేసింది కీర్తి సురేశ్. ప్రస్తుతం తన దృష్టాంతా కూడా సినిమాలపైనే ఉందని, పెళ్లి చేసుకుంటే మాత్రం అంద‌రికి చెప్పి చేసుకుంటానంటూ కీర్తి కామెంట్ చేసింది.

Leave a Comment