Lakshmi Parvathi | నన్ను చూసిన రోజే మనం పెళ్లి చేసుకుందాం అని ఎన్టీఆర్ నన్నడిగారు… లక్ష్మీ పార్వతి

Lakshmi Parvathi | దివంగత ముఖ్యమంత్రి, ప్రఖ్యాత సినీ నటుడు ఎన్టీ రామారావు అంటే తెలుగు ప్రజల్లో ఆరాధ్య భావం ఉంటుంది. కృష్ణా జిల్లా నిమ్మకూరులో జన్మించిన ఎన్టీఆర్.. సినిమా, రాజకీయ రంగాల్లో చరిత్ర సృష్టించారు. ఇంతటి ఘన చరిత్ర కలిగిన ఎన్టీఆర్.. తన జీవితంలోని చివరి ఘడియల్లో మాత్రం చాలా దారుణ పరిస్థితులు ఎదుర్కొన్నారు. సొంత వాళ్లే తిరుగుబావుటా ఎగరేసి.. అత్యంత అవమానకర రీతిలో ఎన్టీఆర్‌ను ముఖ్యమంత్రి పదవి నుంచి దించేశారు. ఒక‌ప్పుడు తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో తిరుగులేని స్టార్ గా చ‌క్రం తిప్పిన సీనియ‌ర్ నంద‌మూరి తార‌క రామారావు కాలం నుండే ఉన్నాయి. అయితే ఒక్క‌డ రెండో వివాహం వెన‌క ఒక్కో బ‌ల‌మైన కార‌ణం దాగి ఉంది.

ఎన్టీఆర్ గారి భార్య

ఆ కార‌ణాలు అంగీక‌రించేలా ఉన్నాయి కాబ్బ‌ట్టే అభిమానులు, ప్రేక్ష‌కుల నుండి కూడా మ‌ద్ద‌తు ల‌భించింది. అయితే ఇందులో కొంత మంది తార‌ల సతీమ‌ణులు కొన్ని ప‌రిస్థితుల్లో అర్ధాత‌రంగా త‌నువు చాలించ‌డంతో అనివార్య ప‌రిస్థితుల్లో రెండో పెళ్లి కి రెడీ అయితే…. మ‌రికొంత మంది హీరోలు మాత్రం మ‌ద్య‌లోనే వివాహానికి బ్రెక్ పెట్టి రెండో పెళ్లికి రెడీ అయిపోయారు. ఒక్క‌సారి నాటి నుంచి రెండో వివాహాలు చేసుకున్న హీరోల వివ‌రాల‌ను గ‌మ‌నిస్తే…. నంద‌మూరి తార‌క రామారావు తెలుగు చిత్ర సీమ నాటి త‌రం అగ్ర‌హీరో. ఆయ‌న సినీమా చ‌రిత్ర‌లో నిలిచిపోయేలా ఉండేవి. ఆయ‌న త‌న 20 వ ఏటా మేన‌మామ కూతురు బ‌స‌వ తార‌కం ను వివాహామాడారు.

ఈ దంపతుల‌కు 12 మంది సంతానం. అందులో 8 మంది అబ్బాయిలు, న‌లుగురు అమ్మాయిలు. అయితే స‌తీమ‌ణి క్యాన్స‌ర్ వ్యాధి తో పోరాడి చివ‌రకు 1984 సెప్టెంబర్ 1 ను మ‌ద్రాస్ ఆస్ప‌త్రిలో మృతి చెందారు. ఆమె 59 సంవ‌త్స‌రాల‌కే త‌నువు చాలించారు.ఆ తరువాత లక్ష్మీపార్వతి చేసుకున్నాడు. అయితే ఎన్టీఆర్‌ను పదవీచ్యుతుడిని చేసేందుకు ప్రత్యర్థి వర్గం సాకుగా చూపించిన ఏకైక వ్యక్తి.. లక్ష్మీపార్వతి! ఎన్టీఆర్ చివరి రోజుల్లో ఆయన జీవితంలోకి వచ్చిన లక్ష్మీపార్వతి.. కడవరకూ ఆయన వెన్నంటే ఉన్నారు.అలాంటి ఎన్టీఆర్.. తనను విడిచిపెట్టి వెళ్లిపోయి అన్యాయం చేశారని లక్ష్మీపార్వతి కన్నీటి పర్యంతమయ్యారు.

Lakshmi Parvathi

తాజాగా, ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన పెళ్లి, తర్వాత జరిగిన పరిణామాలను పూసగుచ్చినట్లు లక్ష్మీపార్వతి వివరించారు. ఎన్టీఆర్ తన పట్ల ఆకర్షితులవడానికి తనేమీ పెద్ద అందగత్తెనేమీ కాదనీ, కేవలం ఆత్మీయతే తామిద్దరిని కలిపిందని చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ నటించిన ‘సామ్రాట్ అశోక’ చిత్రం షూటింగ్ జరుగుతుంటే తను ఆ షూటింగ్ స్పాటుకు వెళ్లాననీ, అక్కడ ఎన్టీఆర్‌తో పాటు లక్ష్మిగారు కూర్చుని వున్నట్లు చెప్పారు. కొద్దిసేపటికి ఎన్టీఆర్ వద్ద శెలవు తీసుకుంటూ ఇక నేను వెళ్లొస్తానని చెప్పగానే మళ్లీ ఎప్పుడు వస్తారు అని అడిగారనీ, ఆ మాటతో ఆయనలో తన పట్ల వున్న ఆత్మీయత వెల్లడైందన్నారు.

Also Read : ప్రతిరోజూ అల్లం తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..

అలా తమ మధ్య మొదలైన అనుబంధం క్రమేపీ బలపడిపోయిందనీ, నరసరావుపేటలో తను నివాసముంటున్న ఇంటికి ఎన్టీఆర్ స్వయంగా ఫోన్ పెట్టించి దాని బిల్లు రూ.3 లక్షలు ఆయనే కట్టారని గుర్తు చేసుకున్నారు. దీన్నిబట్టి ఆయన తన పట్ల ఎంత ప్రేమను చూపించారో అర్థమవుతుందనీ, అలా ఒకరోజు తనను పెళ్లాడుతానంటూ ఆయనే స్వయంగా ప్రపోజ్ చేశారని చెప్పారు. ఐతే కొద్ది సమయం కావాలని చెప్పి ఆ తర్వాత తన మొదటి భర్తకు విడాకులు ఇస్తున్నట్లు ఎన్టీఆర్‌కు చెప్పినట్లు లక్ష్మీపార్వతి వెల్లడించారు.నారా చంద్రబాబునాయుడు భార్య భువనేశ్వరి ని దృష్టిలో పెట్టుకొని లక్ష్మీపార్వతి మాట్లాడుతూ..

నీకు ఎన్ని సంవత్సరాలకు నీ తండ్రి ఎన్టీఆర్ గారు గుర్తుకొచ్చారో.. అసలు నీలాంటి కూతురు దొరకడం ఆయన దురదృష్టకరం.. నీ భర్త , కొడుకు సీఎంలు అయిపోవాలని కోరుకుంటూ.. నీ తండ్రి చావు కోసం క్షుద్ర పూజలు ఆ గుడిలో చేయించావని ఎవరికి తెలియదు. నీకు నిజంగా నీ తండ్రి మీద ప్రేమ ఉంటే నీ భర్త చేసిన అవినీతులన్నీ బయటపెట్టి.. ఆయన పేరుని నిలబెట్టు. హెరిటేజ్ లెక్కలను బయట పెట్టు. నీలాంటి కూతురు ఎన్టీఆర్ గారికి పుట్టడం నిజంగా బాధాకరం అని ఆమె సంచలన వ్యాఖ్యలు చేయడంతో పాటు.. రామారావు గారు బ్రతికి ఉండగా.. చంద్రబాబు నిజస్వరూపం గురించి ఆయన చెప్పిన వీడియో తో పాటు.. ఇప్పుడు ఈ వార్తలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

 Lakshmi Parvathi

ఎన్టీఆర్ పాలనలో అవినీతి నా కళ్లారా చూశా..

ఇక, నాతో పెళ్లి అయిన తర్వాత ఎన్టీఆర్ అఖండ విజయం సాధించి ప్రమాణస్వీకారం చేసిన రోజు.. నా చేతిలో చెయ్యేసి ‘‘లక్ష్మీ పెరాలసిస్ స్ట్రోక్‌తో పోతాననుకున్న వాడిని తిరిగి బతికించకున్నావు. అలాగే, ఎన్నికలకు తిరగలేను అనుకున్నవాడిని.. తిప్పావు, నువ్వూ తిరిగావు. ఇంతటి గెలుపునకు కారణం నువ్వే.. నాకు నువ్విప్పుడు భాగ్య దేవతవి. నీకేం కావాలో అడుగు.. ఇచ్చేస్తాను’’ అని ఎన్టీఆర్ అడిగారు.అలాగే ఇంకో భార్య అయితే, ఏమి కోరుకునేదో నాకు తెలియదు గానీ, నేనొక్కటే అడిగా.. ‘‘మీరు 1982లో పార్టీ పెట్టినప్పుడు మీ ఆశయాలన్నీ నాకు చాలా నచ్చాయి. ఎందుకంటే, నేను కమ్యూనిస్టు ఫ్యామిలీలో పుట్టాను.

కొన్ని ఆదర్శ విధానాలకు కట్టుబడి ఉన్నదాన్ని. అలాంటిది మీ ప్రభుత్వంలో అవినీతి బాగా పెరిగిపోయింది.మాది అన్ ఎయిడెడ్ కాలేజీ.. దాన్ని ఎయిడెడ్ కాలేజీగా మార్చాలని మీ అల్లుడి దగ్గరకు వస్తే ఆయన రూ. 6 లక్షలు అడిగారు. మా జీతం రూ. 1,500.. మేము రూ. 6 లక్షలు ఇవ్వగలమా? ఇలాంటి అవకవతకలు జరగకుండా, అవినీతికి తావులేకుండా.. మీరు నాకు మాట ఇవ్వండి.. నాకు ఈ ఒక్క మాట ఇవ్వండి.. అని అడిగాను. అంతే.. ఎన్టీఆర్ బుటబుటా కన్నీళ్లు కార్చేశారు. ఇంత గొప్పదా నా భార్య.. ఇంత ఉన్నతమైన ఆశయాలు కలిగినదా అని సంతోషపడ్డారు.

బసవతారకం గొప్పతనం

సీనియర్ ఎన్టీఆర్ షూటింగ్ లో బిజీగా ఉన్నప్పుడు, ఆమె పిల్లల పెంపకాన్ని స్వయంగా చూసుకోవడం వల్లే బాలకృష్ణ, రామకృష్ణ , హరికృష్ణ హీరోలుగా మారారు. కుటుంబ సభ్యులకు ఏమాత్రం కష్టం రాకుండా చూసుకోవడమే కాకుండా సీనియర్ ఎన్టీఆర్ ఎప్పుడు బయటకు వెళ్ళినా ఆయన భార్య బసవతారకం ఎదురు వచ్చేవారు. తాజాగా ప్రముఖ దర్శకుడు వివి రాజు మాట్లాడుతూ.. తారకమ్మ ఎంతో మంచిది .. ఇంటికి వచ్చిన వాళ్లకు చాలా రుచికరమైన ఆహారం అందేలా చూస్తూ ఉండే వారు.

Also Read : రాజేంద్ర ప్ర‌సాద్ జీవితంలో ఇన్ని బాధలు ఉన్నాయా..

కుటుంబ సభ్యుల క్షేమం కోసమే ఆరాట పడుతూ ఉండేవారు . ఇక సెట్‌కి కూడా చాలా అరుదుగా మాత్రమే వచ్చే వారు.. నన్ను కూడా సొంత కొడుకులా చూసుకున్నారు అంటూ దర్శకుడు వెల్లడించారు. నేను ఎప్పుడు ఎవరితో ఎలా ప్రవర్తించాలో కూడా ఆమె నేర్పారు.. తారకమ్మ ఎప్పుడూ కూడా సినిమా విషయంలో ఇన్వాల్వ్ అయ్యే వారు కాదు.. ఎన్నో గుప్తదానాలు కూడా చేశారు అని ఆయన వెల్లడించారు. సీనియర్ ఎన్టీఆర్ అంటే తనకు ఎనలేని అభిమానం అని మా ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా సరే ముందుగా సహాయం చేసే వారిని, అంతేకాదు ఒక సందర్భంలో ఆర్థిక సహాయం కూడా చేశారు అని ఆయన తెలిపారు.

ల‌క్ష్మీ పార్వ‌తి మొద‌టి భ‌ర్త

ల‌క్ష్మీ పార్వ‌తి మొద‌టి భ‌ర్త పేరు వీర‌గ్రంధం వెంక‌ట సుబ్బారావు. ఆయ‌న హ‌రిక‌ళ‌లో ప్ర‌సిద్దుడు. హిందూ మ‌తం క‌లుషితం అవ్వ‌కుండా ఖండాలు దాటి హ‌రిక‌ళ ద్వారా ప్ర‌జ‌ల్లో చైత‌న్యం తీసుకువ‌చ్చాడు. అయితే వీర‌గ్రంధంకు కూడా ల‌క్ష్మీ పార్వ‌తి రెండ‌వ భార్య‌నే..ఆయ‌న మొదటి భార్య బిడ్డ పుట్టిన వెంట‌నే మ‌ర‌ణించ‌డంతో పెద్ద‌లు ల‌క్ష్మీపార్వ‌తితో వివాహం జ‌రిపించారు.ల‌క్ష్మీపార్వతి సంస్కృతంలో డిగ్రీ చేసింది. పెళ్లైన త‌ర‌వాత ల‌క్ష్మీ పార్వ‌తి ఎంఏ చ‌దువుతానంటే ఆమె భ‌ర్త నాగార్జున యూనివ‌ర్సిటీలో చేర్పించారు.

అంతే కాకుండా ఒక క‌ళాకారుడు రాజ‌కీయాల్లోకి వ‌చ్చి సీఎం అయితే క‌ళ బ్ర‌తుకుతుంద‌ని భావించిన సుబ్బారావు టీడీపీలో చేరి ఆ పార్టీ త‌ర‌పున ప్ర‌చారం కూడా చేయ‌డం మొద‌లుపెట్టారు. ఈ విష‌యం ఎన్టీఆర్ కు తెలిసి వారిద్ద‌రినీ పిలిపించుకుని అభినందించారు. అంతే కాకుండా వీర‌గ్రంధం వెంక‌ట సుబ్బారావు క‌ళాకారుల కోసం వీర‌గ్రంధం క‌ళాక్షేత్రం అనే సంస్థ‌ను స్థాపించాడు. దానికోసం ఎన్టీఆర్ కొంత భూమిని ఇవ్వ‌గా ఆ భూమిని లక్ష్మీపార్వ‌తి పేరిట రిజిస్ట్రేష‌న్ చేయించారు. కానీ ఎన్టీఆర్ మ‌ర‌ణానంత‌రం ఆ భూమి విష‌య‌మై కొంత‌కాలం ఇద్ద‌రి మ‌ధ్య గొడ‌వ‌లు కూడా జ‌రిగాయి.

ఎన్టీఆర్ కు ఎన్ని ఆస్తులున్నాయి..

ఎన్టీఆర్ ఓ వైపు సినిమాలు చేస్తూ.. పార్టీని అభివృద్ధి చేస్తూనే.. ప్రజారంజక పాలన కొనసాగించారు. అలానే తాను సంపాదించిన సొమ్ముతో ఆస్తులను కూడా కూడపెట్టారు. సినిమాల ద్వారా తాను సంపాదించిన సొమ్ము మొత్తాన్ని ఎన్టీఆర్ తన కొడుకులకు సమానంగా పంచిపెట్టారు. ఓ మధ్య తరగతి కుటుంబం నుంచి సినిమా ఇండస్ట్రీ కి వచ్చిన ఎన్టీఆర్ తెలుగు సినిమా పరిశ్రమలో హీరోగా నిలిచి చరిత్రని తిరగరాశారు. చెన్నై నుంచి సినిమా ఇండస్ట్రీని హైదరాబాద్ కు తీసుకొచ్చి.. ఇక్కడ కూడా ఆస్తులను కూడబెట్టారు.

చెన్నై నుంచి హైదరాబాద్ కు వచ్చిన మొదట్లో ‘ఎన్టీఆర్ ఎస్టేట్ ప్రాంతం’ను ఎన్టీఆర్ కొనుగోలు చేసారు. ఎంతో ఇష్టపడి రామకృష్ణ థియేటర్ ను నిర్మించారు. దాని పక్కనే ఓ బార్ ను, ఇతర ఆస్తులను కూడా కొనుగోలు చేసారు. ఆహ్వానం హోటల్ కాంప్లెక్, రామకృష్ణ జంట థియేటర్స్, ఎన్టీఆర్ ఉన్న ఇల్లు.. ఇవన్నీ ఎన్టీఆర్ ఎస్టేట్ లోని భాగాలే. సీఎం గా ఉన్నన్ని రోజులు నగరానికో థియేటర్ కట్టాలని ఆయన అనుకున్నారు. కానీ కొన్ని నగరాల్లో మాత్రమే ఆయన నిర్మించగలిగారు.

సంపాదించినా సొమ్మంతా థియేటర్లు, బంగ్లాలు, భూములపైనే ఖర్చు చేసారు. ఆయన కొన్న ఐదు భవనాల్లో ఐదుగురు కొడుకులు ఉంటున్నారు. చివరగా ఆయన ఉన్న ఇల్లు బంజారాహిల్స్ లోని రోడ్ నంబర్ 13లో ఉంది. దీనిని లక్ష్మి పార్వతి పేరుపైకి మార్చేశారు. ఆ ఇంటి ఎదురుగ ఉన్న మ్యూజియాన్ని, పక్కన ఉన్న ప్రాంతాన్ని కూడా రాజకీయాల్లోకి వచ్చాక కొన్నారు. చాలానే ఆస్తులను కొనుగోలు చేసిన ఎన్టీఆర్ చివరకు తన కొడుకులకు, కూతుర్లకు పంచిపెట్టేసారు. చివరకు రాజకీయాల్లో దెబ్బ తిని, సొంత కుటుంబం వెన్నుపోటు పొడవడంతో గుండెపోటుకు గురై మరణించారు.

Leave a Comment