Naga Chaitanya | నాగచైతన్య నికర ఆస్తులు ఎన్ని వందల కోట్లో తెలుసా..?

Naga Chaitanya | టాలీవుడ్ అక్కినేని హీరో నాగచైతన్య గురించి మనందరికీ తెలిసిందే.నాగార్జున తనయుడిగా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు.ఇకపోతే నాగచైతన్య ప్రస్తుతం తండేల్ సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.తాజాగా అక్కినేని వారసుడు నాగచైతన్య రెండోసారి పెళ్లి పీటలు ఎక్కబోతున్న సంగతి మనకు తెలిసిందే .సమంతను ప్రేమించి పెద్దల సమక్షంలో ఎంతో ఘనంగా వివాహం చేసుకున్న నాగచైతన్య ఆమెకు పలు వ్యక్తిగత విషయాల కారణంగా విడాకులు ఇచ్చారు.

నాగ చైతన్య తల్లి

ఇలా విడాకులు తీసుకున్నటువంటి నాగచైతన్య అనంతరం మరొక హీరోయిన్ శోభిత ప్రేమలో పడిన సంగతి తెలిసిందే.ఇలా కొంతకాలంగా ప్రేమలో ఉన్నటువంటి వీరిద్దరూ ఇటీవల నిశ్చితార్థం చేసుకుని అందరికీ షాక్ ఇచ్చారు. ఇక ఈ విషయాన్ని నాగార్జున సోషల్ మీడియా వేదికగా అధికారికంగా వెల్లడించారు. నాగచైతన్య శోభిత నిశ్చితార్థం మా ఇంట్లో సంతోషాన్ని తిరిగి తెచ్చిందని వారిద్దరూ ఎప్పుడు సంతోషంగా ఉండాలని ఈయన నిశ్చితార్థపు ఫోటోలను షేర్ చేశారు.

అలాగే చాలా హడావిడిగా నిశ్చితార్థం చేశామని పెళ్లికి కాస్త సమయం తీసుకుంటామని తెలిపారు.ప్రస్తుతం శోభిత నాగచైతన్య ఇద్దరు కూడా సినిమా పనులలో బిజీగా ఉన్నారు.అయితే అంతక ముందు నాగచైతన్య- సమంత. చాలా కాలం ప్రేమించి పెళ్ళాడిన వీరు.. నాలుగేళ్లు నిండకుండానే మనస్పర్ధలతో విడిపోయారు. అందమైన జంటగా అభిమానులు ముచ్చటపడిన వీరు.. విడాకుల వార్తలతో అందరికి షాక్ ఇచ్చారు. 2017లో పెళ్లి చేసుకొని.. నాలుగేళ్ల వివాహ బంధాన్ని 2021లో ముగించారు.

Naga Chaitanya

కాగా నాగచైతన్య సమంత నుంచి విడాకులు తీసుకున్నా.. శోభితతో ఎంగేజ్మెంట్ జరిగినా కూడా.. సమంతను ఇంకా నాగచైతన్య మర్చిపోలేక పోతున్నాడు అని అంటున్నాడు అభిమానులు. ఈ జంట విడిపోయిన తర్వాత, చైతన్య తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ నుండి సమంతతో ఉన్న అన్ని ఫోటోలను డిలేట్ చేశాడు. కాని ఒక్క మజిలీ సినిమా పోస్టర్ మాత్రం ఉంచాడు.అయితే ఇది కూడా పెద్ద విషయం కాదు కాని.. ఒక్క ఫోటో మాత్రం చైతు తీయలేదు.

నాగచైతన్య రెండో పెళ్లి

ఈ ఏడాది చివరిన లేదా వచ్చేయేడాది ఫిబ్రవరిలో వీరి వివాహం జరగబోతుందని సమాచారం. అలాగే నాగచైతన్య మొదటి పెళ్లి క్రిస్టియన్ పద్ధతిలో, అలాగే మన హిందూ సంప్రదాయం ప్రకారం గోవాలో జరిగింది. ఈ క్రమంలోనే నాగచైతన్య రెండో పెళ్లి ఎక్కడ చేయాలి అనే విషయంలో కూడా ఆలోచన చేస్తున్నారని తెలుస్తోంది.వీరి పెళ్లి హైదరాబాదులో కాకుండా రాజస్థాన్ లేదా డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం విదేశాలలో కూడా సరైన ప్లేస్ కోసం సెర్చ్ చేస్తున్నట్టు సమాచారం.

Also Read : తిండి కోసం లారీలకు పెయింట్స్ వేసిన బ్రహ్మానందం..

వచ్చేయేడాది ఫిబ్రవరిలో అయితే నాగచైతన్య శోభిత కమిట్ అయిన సినిమాలు కూడా పూర్తి అవ్వడంతో వీరికి కూడా కాస్త విరామం దొరుకుతుందని అందుకే వచ్చేయేడాది మొదట్లోనే వీరి పెళ్లి జరగబోతుందని తెలుస్తోంది. ఇక త్వరలోనే వీరి పెళ్లికి సంబంధించిన అన్ని విషయాలను కూడా అధికారికంగా వెల్లడించబోతున్నారని సమాచారం.

ఫ్రెండ్‌గా, లవర్‌గా హీరోయిన్..

ఇదిలా ఉంటే నాగ చైతన్య తో ఓ హీరోయిన్ తల్లిగా, ఫ్రెండ్ గా, హీరోయిన్ గా నటించింది. ఆ అమ్మడు ఎవరో తెలుసా.? సినిమాల్లో ఇలా జరగడం చాలా కామన్. ఓ సినిమాలో హీరో పక్క న హీరోయిన్ గా నటించిన అవారే ఆతర్వాత అదే హీరోకు వదినగానో..లేక తల్లిగానో నటించిన సందర్భాలు ఉన్నాయి. అలాగే ఇప్పుడు నాగ చైతన్య తో కూడా ఓ హీరోయిన్ తల్లిగా, ఫ్రెండ్ గా, లవర్ గా చేసింది.

ఆమె లావణ్య త్రిపాఠి. ఈ బ్యూటీ కింగ్ నాగార్జున హీరోగా నటించిన సోగ్గాడే చిన్ని నాయన సినిమాలో ఆయనకు భార్యగా నటించింది. ఆతర్వాత ఆ సినిమాకు సీక్వెల్ గా వచ్చిన బంగార్రాజు సినిమాలో నాగ్ కొడుకుగా నాగ చైత్యన నటించాడు. అలాగే మనం సినిమాలో వీరిద్దరూ స్నేహితులుగా నటించడం జరిగింది. మనం సినిమాలో ఆమె చిన్న పాత్రలో కనిపిస్తుంది. అలాగే ఈ ఇద్దరూ హీరో హీరోయిన్స్ గా యుద్ధం శరణం అనే సినిమాలో చేశారు. ఇలా నాగ చైతన్యతో లావణ్య త్రిపాఠీ అమ్మగా, ఫ్రెండ్ గా, లవర్ గా నటించి మెప్పించింది.

నామూవీలో నాగార్జున..

ఇండస్ట్రీలో యంగ్ హీరోల సినిమాల్లో సీనియర్ హీరోలు క్యామియో రోల్స్ చేయడం అన్నది ఎప్పటి నుంచో వస్తున్న సంప్రదాయం. అయితే ఇలాంటి క్యామియో రోల్స్ లో తండ్రీ కొడుకులు కనిపించడం అన్నది చాలా అరుదు. ఇలాంటి అరుదైన క్యామియోనే త్వరలో టాలీవుడ్ లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. తండేల్ మూవీ తర్వాత నాగచైతన్య డైరెక్టర్ కార్తీక్ దండుతో ఓ మూవీ చేయబోతున్నాడు. ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. అయితే లేటెస్ట్ గా ఈ చిత్రానికి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

అదేంటంటే?కార్తీక్ దండు-నాగచైతన్య మూవీలో కథను అనుగుణంగా ఫ్లాష్ బ్యాక్ లో ఓ సీనియర్ హీరో కనిపిస్తాడ. ఆ క్యారెక్టర్ ను నాగార్జున చేస్తే బాగుంటుందని మేకర్స్ భావిస్తున్నారట. ఈ పవర్ ఫుల్ క్యారెక్టర్ కేవలం 10 నిమిషాలు మాత్రమే అయినప్పటికీ.. స్కోప్ ఉంటుందట. మరి ఈ మూవీలో నటించడానికి నాగ్ ఒప్పుకుంటాడా? లేడా? అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మిగిలింది. ఇక ఈ చిత్రంలో చై లుక్ చాలా కొత్తగా ఉంటుందని టాక్. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ ఈ మూవీని నిర్మిస్తోంది. ఈ కాంబినేషన్ ను ప్రేక్షకులు అస్సలు ఊహించి ఉండరని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.Naga Chaitanya

చైతూ నికర ఆస్తులు ..

నాగచైతన్య నికర ఆస్తులు రూ.154 కోట్లు. నాలుగు దశాబ్దాలుగా నాగార్జున నటుడిగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేశారు. అంతకు ముందు అక్కినేని నాగేశ్వరరావు వారసత్వాన్ని తాను కొనసాగిస్తూ వస్తున్నారు. శోభిత దూళిపాళ నికర ఆదాయం ఏడు నుంచి పది కోట్లు మాత్రమే. నాగచైతన్య ఒక్కో సినిమాకు ఎనిమిది కోట్లు తీసుకుంటారని సమాచారం. అయితే చైతూకు వరుస హిట్లు పడితే ఈ ఫిగర్స్ మారతాయి. హిట్స్ అండ్ ఫ్లాప్స్ ను బట్టి ఈ ఫిగర్లు ఒక్కోసారి తగ్గవచ్చు..పెరగవచ్చు.. అంటే ఓవరాల్ గా రూ.5 నుంచి రూ.10 కోట్ల మధ్య పారితోషికం తీసుకుంటారు నాగచైతన్య. 2022లో నాగచైతన్య క్లౌడ్ కిచెన్ షోయు ఫ్రాంచెయిస్ ప్రారంభించారు.Naga Chaitanya

Also Read : మళ్లీ పెళ్లి చేసుకున్న ప్రకాష్ రాజ్ అసలు కారణం ఏమిటి అంటే..?

ఉత్తరాది, దక్షిణాది వంటకాలను తయారు చేయించి వివిధ స్టార్ హోటళ్లకు సప్లై చేస్తారు. 2024లో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లోనూ ప్రారంభించారు. సోషల్ మీడియా ఇన్ స్టాలో 7.4 మిలియన్ ఫాలోవర్స్ కలిగివున్న నాగచైతన్య సోషల్ మీడియాలో లో ప్రొఫైల్ పాటిస్తుంటారు. మైంత్ర,ఎయిర్ టెల్, క్లోజప్ పేస్ట్ వంటి కమర్షియల్ యాడ్స్ లో నటించారు.వీటితోపాటు ఆదిత్య బిర్లా గ్రూప్ నకు సంబంధించిన తాస్య,తరుణ్ తహిలానీ, ఐస్ క్రీమ్ బ్రాండ్ మాగ్నమ్ ఇండియా, ఫర్నిచర్ బ్రాండ్ దాసోస్ కేబినెట్స్ తదితర సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ గా చేశాడు. నాగచైతన్య 2023తో జూబ్లీ హిల్స్ హైదరాబాద్ లో రూ.15 కోట్లు పెట్టి కొనుగోలు చేశారు. సమంత, చైతూ ఇద్దరూ ఆ ఇంట్లో కొంతకాలం ఉన్నారు. నాగార్జున కూడా రూ.45 కోట్లు ఖరీదు చేసే ఇంటిలో నివాసం ఉంటున్నారు.Naga Chaitanya

Naga Chaitanya

శోభిత ఆస్తులు

ఇప్పటికే శోభిత ధూళిపాళ్ల పేరు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు పొందింది. కానీ, ఆమె వ్యక్తిగత జీవితాన్ని చాలా మందికి తెలియకపోవచ్చు. తెనాలిలో జన్మించిన ఈ అందాల తార జీవిత కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మొదట ఆమె కూడా ఆమ్స్ బిజినెస్ మెన్ కూతురు అని వార్తలు వచ్చాయి. అలాగే ఇంచుమించు నాగచైతన్యకు తగ్గట్టుగా ఆస్తులు ఉన్నాయని కూడా కామెంట్స్ వచ్చాయి.నిజానికి ఆ వార్తల్లో నిజం లేదు. ఆమె తండ్రి వేణుగోపాలరావు మెర్చంట్ నేవీ ఇంజనీర్ కాగా, ఆమె తల్లి శాంతా కామాక్షి ఒక ప్రైమరీ స్కూల్ టీచర్. ముమ్మాటికి సాదాసీదా తెలుగు కుటుంబం నుంచి వచ్చిన శోభిత, తన కుటుంబంతో కలిసి విశాఖపట్నంలో పెరిగింది.

అక్కినేని వారి ఆస్తులతో పోలిస్తే వారి ఆస్తులు చాలా తక్కువ. కానీ నాగచైతన్య కేవలం ఆమెతో జీవితం బాగుంటుందని మాత్రమే ఆలోచించి పెళ్లికి సిద్ధమయ్యాడు.సోభిత ధూళిపాళ్లకు మంచి శిక్షణ పొందిన విద్యార్థిని మాత్రమే కాదు, ఆమె అందాల పోటీలలో కూడా విజయాన్ని సాధించింది. ఆమె మొదటిసారి పాల్గొన్న బ్యూటీ పేజెంట్ ఆర్మీ ఈవెంట్ లో జరిగింది. ఆ తర్వాత, 2013 లో జరిగిన మిస్ ఎర్త్ పోటీల్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది. ఆమె సినీరంగంలో 2016లో అడుగు పెట్టింది. అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో వచ్చిన రామన్ రాఘవ్ 2.0 అనే సినిమాలో విక్కీ కౌశల్ సరసన ఆమె తొలిసారిగా నటించింది.|Naga Chaitanya

‘తండేల్’ అంటే

అక్కినేని నాగ చైతన్య చివరిగా కనిపించిన ‘కస్టడీ’ మూవీ ప్రేక్షకులను అంతగా అలరించలేకపోయింది. తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు తెరకెక్కించిన ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. భారీ అంచనాల నడుమ ఈ చిత్రం విడుదలైనా, ప్రేక్షకులకు అంతగా నచ్చలేదు. ప్రస్తుతం నాగ చైతన్య తన ఆశలన్నీ తర్వాతి సినిమా ‘తండేల్’ మీదే పెట్టుకున్నారు. ప్రస్తుతం ఆయన చందు మొండేటి దర్శకత్వంలో ఈ మూవీ చేస్తున్నారు.నాగ చైతన్య హీరోగా గీతా ఆర్ట్స్ సంస్థ ‘100 పర్సెంట్ లవ్’ నిర్మించింది. ఇప్పుడు మళ్లీ ‘తండేల్’ మూవీని నిర్మిస్తోంది. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

Also Read :  నాగార్జున మొదటి భార్యతో ఎందుకు విడిపోయారో తెలుసా..?

ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే నాగ చైతన్య, సాయి పల్లవి కలిసి నటించిన ‘లవ్ స్టోరీ’ సినిమా మంచి సక్సెస్ అందుకుంది. ఇప్పుడు ‘తండేల్’ కోసం మరోసారి జోడీ కడుతోంది. తాజాగా తండేల్’ అంటే ఏంటి అని నెటిజన్లు ఆరా తీస్తున్నారు. గుజరాతీ భాషలో ‘తండేల్’ అంటే బోటు నడిపే ఆపరేట్ అని అర్థం అన్నారు. గుజరాత్, పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతంలోని గ్రామాల ప్రజలు ‘తండేల్’ అనే పదాన్ని ఉపయోగిస్తారని చెప్పారు. బతుకుతెరువు కోసం గుజరాత్‌ వీరవల్‌కు వెళ్లిన కొంత మంది శ్రీకాకుళం మత్స్యకారులు, చేపల వేటకు వెళ్లి పాకిస్థాన్‌ కోస్టుగార్డులకు చిక్కుతారు. ఆ తర్వాత ఏం జరిగిందనే కథాంశంతో ‘తండేల్’ సినిమా తెరకెక్కనుంది.|Naga Chaitanya

Leave a Comment