Brahmanandam | లెజెండరీ కామెడీ యాక్టర్ అయినా బ్రహ్మానందం మూడున్నర దశాబ్దాల నుంచి తన సినీ కెరియర్ లో 1200లకు పైగా సినిమాల్లో నటించారు. కేవలం కమెడియన్ గా మాత్రమే కాదు విలక్షణ పాత్రల్లో కూడా అలరించారు అని చెప్పాలి.మిగతా నటులతో పోల్చి చూస్తే విలక్షణమైన నటనతో ప్రత్యేకమైన డైలాగ్ డెలివరీతో ప్రేక్షకులందరికీ కూడా బాగా దగ్గరయ్యారు బ్రహ్మానందం. ఇక ఇప్పటికీ కూడా టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో స్టార్ కమెడియన్ గా కొనసాగుతున్నాడు అని చెప్పడంలోనూ అతిశయోక్తి లేదు అని చెప్పాలి.
లారీలకు పెయింట్స్
అయితే బ్రహ్మానందం అసలు పేరు కన్నెగంటి బ్రహ్మానందం. 1956 ఫిబ్రవరి 1వ తేదీ, ఆంధ్రప్రదేశ్ లోని సత్తెనపల్లిలో చాగంటి వారి పాలెం గ్రామంలో జన్మించారు.ఒకప్పుడు లెక్చరర్ గా పనిచేసిన ఈయన ఆహనా పెళ్ళంట అనే సినిమాతో ఇక ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. మొదటి తరం హీరోలైనా ఏఎన్నార్ ఎన్టీఆర్ సహా నేటితరం హీరోల వరకు అందరితో స్క్రీన్ షేర్ చేసుకున్నారు.ఈ మద్యనే బ్రహ్మానందం తన ఆత్మ కథను పుస్తకంగా రాసిన సంగతి మనకు తెలిసిందే.నేను మీ బ్రహ్మానందం అనే పుస్తకంలో ఈయన తన ఆత్మ కథను రాశారు.తన జీవితంలో జరిగినటువంటి ఎన్నో ఇబ్బందులు, ఉద్యోగాలు, సినిమాలలోకి రావడం ఇలా అన్ని విషయాల గురించి కూడా బ్రహ్మానందం ఈ పుస్తకంలో తెలియజేశారు.
ఇందులో భాగంగా ఈయన నిరుపేద కుటుంబంలో జన్మించారని, తన చదువు(Studies) కోసం ఎంతోమంది ఎన్నో విధాలుగా సహాయం చేశారని తెలియజేశారు.కాలేజీకి వెళ్తున్నటువంటి దారిలో లారీలకు పెయింటింగ్(Lorry Painting) వేసే షాపులో తాను చేరానని ఈయన తెలిపారు.వారి దగ్గర సహాయకుడిగా పని చేస్తూ డబ్బు సంపాదించాను.లారీలకు పెయింటింగ్ వేయడం వల్ల నెలకు ఇంత అని డబ్బు ఇచ్చే వారు కాదు ఎంత పని చేస్తే అంత డబ్బు ఇచ్చే వాళ్ళు అలా నేను అప్పట్లో నాలుగు రూపాయలు ఐదు రూపాయలు అందుకునే వాడిని ఇదే నా మొదటి సంపాదన (First Earning) అంటూ బ్రహ్మానందం తెలిపారు.
ఇంటర్‌క్యాస్ట్ మ్యారేజ్
బ్రహ్మానందం ఎన్నో కష్టనష్టాలను దాటుకొని చదివి కాలేజీ లెక్చరర్ గా జాబ్ సంపాదించారు. అత్తిలిలో లెక్చరర్ గా చేసేటప్పుడు ఇంట్లో వాళ్ళు సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. చిన్నప్పట్నుంచి పేద కుటుంబం అవ్వడం, బ్రహ్మానందం కష్టపడి చదువుకొని లెక్చరర్ జాబ్ తెచ్చుకోవడంతో కట్నం కోసం కూడా చూసారు తల్లితండ్రులు. అయితే చదువుకి డబ్బుల విషయంలో బ్రహ్మానందంకి హెల్ప్ చేసిన అనసూయమ్మ అనే ఆవిడ బ్రహ్మానందం కోసం ఓ సంబంధం తెచ్చింది. ఆమె భర్త చెల్లిళ్లలో ఒకరైన లక్ష్మిని పెళ్లి చేసుకుంటే బాగుంటుందని బ్రహ్మానందంకి సలహా ఇచ్చారు ఆవిడ. బ్రహ్మానందంకి, లక్ష్మికి ముందే ముఖ పరిచయం ఉంది. అనసూయమ్మ గారు బ్రహ్మానందంకి చాలా సహాయం చేయడం, లక్ష్మి మంచి అమ్మాయి అని తెలుసు కాబట్టి ఆవిడని పెళ్లి చేసుకుందామని ఫిక్స్ అయ్యాడు బ్రహ్మానందం.
Also read : మళ్లీ పెళ్లి చేసుకున్న ప్రకాష్ రాజ్ అసలు కారణం ఏమిటి అంటే..?
కానీ ఇంట్లో చెప్తే వేరే క్యాస్ట్ అని ఒప్పుకోకుండా పెద్ద గొడవ చేశారు. బ్రహ్మానందం వాళ్ళు విశ్వ బ్రాహ్మణులు అయితే, లక్ష్మి వాళ్ళు కాపులు. అందులోను కట్నం లేకుండా పెళ్లి. దీంతో బ్రహ్మానందం ఇంట్లో ససేమీరా ఒప్పుకోలేదు. చాలా ట్రై చేసాడు బ్రహ్మానందం అయినా ఒప్పుకోకపోవడంతో పెళ్లి చేసుకుంటే లక్ష్మిని చేసుకుంటాను లేకపోతే జీవితంలో అసలు పెళ్లి చేసుకోను అని చెప్పడంతో ఏం చేయాలో తెలియక వాళ్ళ తల్లితండ్రులు ఒప్పుకున్నారు. బ్రహ్మానందంకి ఇష్టమైన వేంకటేశ్వరస్వామి ఆలయంలో వీరి పెళ్లి 1977 డిసెంబర్ 14న జరిగింది. అప్పుడున్న జీతంతో ఇద్దరూ బతకడం కష్టం అయినా లక్ష్మి సహకారం వల్లే ఆయన ఇంత సాధించానని, ఆమె ఇంటిని చక్కదిద్దింది అని చెప్పారు బ్రహ్మానందం.
బ్రహ్మానందం హీరోగా
ఇలా రెండు సంవత్సరాల పాటు అక్కడ పనిచేస్తూ తన ఎం ఏ పూర్తి చేశారు.ఆ తరువాత లెక్చరర్ గా పని చేశారు. అయితే ఇప్పుడు వరకు కమెడియన్‌గా నటించిన సినిమాల గురించి చెప్పమంటే టకా టకా చెప్పేస్తుంటారు ప్రేక్షకులు. కానీ బ్రహ్మానందం హీరోగా నటించిన సినిమా గురించి చెప్పమంటే మాత్రం చాలా మంది తెల్ల మొహం వేస్తారు ఎందుకంటే ఈ విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. బ్రహ్మానందం హీరోగా నటించిన ఒకే ఒక్క సినిమా బాబాయ్ హోటల్ జంధ్యాల దర్శకత్వం వహించిన ఈ సినిమాని క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్ పై కేఎస్ రామారావు నిర్మించారు. బ్రహ్మానందానికి జోడిగా మధుశ్రీ నటించింది.
పిల్లలను చేరదీసి కాపాడే ఒక గొప్ప వ్యక్తి కదే బాబాయ్ హోటల్. ఇక ఈ సినిమా 1992లో విడుదలై ఎందుకో ఆశించిన స్థాయిలో మాత్రం విజయం సాధించలేదు.అయితే ఈ మధ్య వయసు రీత్యా అనారోగ్యం సమస్యలతో సినిమాలకు దూరంగా ఉన్నారు. కేవలం ప్రాధాన్యత ఉన్న పాత్రలో మాత్రమే నటిస్తున్నారు. బ్రహ్మానందం మొదటిగా నరేష్ హీరోగా నటించిన శ్రీ తాతావతారం అనే మూవీతో నటుడిగా ఆరంగేట్రం చేశారు. ఆ తర్వాత దాదాపుగా 1250కి పైగా సినిమాలలో నటించిన బహ్మానందం 2010లో పద్మశ్రీ పురస్కారాన్ని కూడా అందుకున్నారు. సినీ దర్శక నిర్మాతలకే కాదు టాప్ మోస్ట్ హీరోలకు కూడా ఆయన ఒక ఫేవరేట్‌గా మారిపోయాడు.
ఆస్తుల విలువ
ఆయన వలనే చాలా సినిమాలు హిట్ అయ్యాయనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.ఇదంతా ఒకెత్తయితే ఇన్నేళ్లలో ఆయన ఎంత సంపాదించి ఉంటారు. ఆయన ఆస్తుల విలువ ఎంత ఉంటుంది అనే ఆలోచన అందరి మెదల్లో మెదులుతూనే ఉంది. ఈ క్రమంలో వాటికి సంబంధించిన ఓ వార్త కూడా తెగ వైరల్ అవుతోంది. నిజానికి బ్రహ్మానందం తనకు వచ్చే రెమ్యునరేషన్లో కొంత భాగాన్ని భూములపై ఇన్వెస్ట్ చేసేవారట. అలాగే ఆయన చేసిన పొదుపుల వల్ల కూడా మరింత స్థిరాస్తిని కూడబెట్టుకున్నారట. అలా ఆయన ఆస్తి ఇప్పుడున్న ధరలో దాదాపుగా రూ.750 కోట్ల వరకు ఉంటుందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.
Also read : నాగార్జున మొదటి భార్యతో ఎందుకు విడిపోయారో తెలుసా..?
బ్రహ్మానందం కొడుకులు
బ్రహ్మానందంకు ఇద్దరు కొడుకులు ఉన్నారనే విషయం కూడా చాలా మందికి తెలియదు. కేవలం పెద్ద కుమారుడి గురించే తెలుసు. పెద్ద కుమారుడు రాజా గౌతమ్, కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో పల్లకిలో పెళ్లి కూతురు అనే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. తరువాత బసంతి అనే సినిమా చేశాడు. అలాగే మను అనే సినిమాలో కూడా నటించాడు కానీ వర్కౌట్ కాలేదు. అయితే ఇప్పుడు సినిమాలలో పెద్దగా కనిపించకపోయినప్పటికీ ఇక వ్యాపారంలో మాత్రం ఫుల్ బిజీగా ఉన్నారు గౌతం. ప్రస్తుతం హైదరాబాద్‌లో తన పేరిట ఎన్నో కమర్షియల్ కాంప్లెక్స్ లను సక్సెస్‌ఫుల్‌గా నడుపుతున్నాడు అని చెప్పాలి.
అంతేకాదు ప్రముఖ ఎమ్మెన్సి కంపెనీలలో గౌతమ్ పెట్టుబడులు కూడా పెడుతున్నాడు అన్నది తెలుస్తుంది. అయితే హైదరాబాద్ తో పాటు బెంగళూరులో కూడా గౌతం కి చాలానే రెస్టారెంట్లు ఉన్నాయి. ఇక గౌతమ్ నెల సంపాదన అటు సినిమాల్లో సంపాదించిన దాని కంటే ఎక్కువగానే ఉంది. సక్సెస్ఫుల్ బిజినెస్ మెన్ గా కొనసాగుతున్న గౌతం ఏకంగా నెలకి 30 కోట్ల వరకు సంపాదిస్తున్నారట.
ఇక రెండవ కుమారుడి గురించి ఎవరికి తెలియదు.అతని పేరు సిద్దార్థ్. నిజానికి బయట జనాలకు సిద్దార్థ్ గురించి పెద్దగా తెలియదు. విదేశాల్లో చదువుకున్న సిద్దార్థ్ ఈమధ్యనే స్వదేశానికి చేరుకున్నాడు. అతనికి సినిమా ఇండస్ట్రీలోకి రావడం పెద్దగా ఇంట్రెస్ట్ లేదని సమాచారం. ఏదైనా బిజినెస్ తోనే కెరీర్ ను సరికొత్తగా స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాడట. బ్రహ్మానందంకు కొడుకును హీరోగా చూసుకోవాలని ఉన్నప్పటికీ అతని నిర్ణయాన్ని కూడా గౌరవిస్తూన్నట్లు అర్ధమవుతోంది.
కష్టాలు మొదలయ్యాయి
బ్రహ్మానందానికి సినిమాలు తగ్గాయా? లేక ఆయనే తగ్గించుకున్నారా? అనేదే సందేహం. కొన్ని దశాబ్దాలుగా షిఫ్టుల వారీగా సినిమాలు చేస్తూ.. వెయ్యికి పైగా సినిమాలతో గిన్నిస్ బుక్ లో కూడా ఎక్కారు. ఒకవేళ కొంచెం రిలాక్స్ అవుదామని సినిమాలు తగ్గించుకున్నారా అనే అనుమానం కూడా ఉంది. కానీ భారీ పారితోషికాన్ని భరించలేకే దర్శక నిర్మాతలు పక్కనపెడుతున్నారన్న వాదన కూడా ఉంది. వీటన్నిటికంటే ఈ మధ్య కుర్ర కమెడియన్లు చెలరేగిపోతున్నారు. స్పూఫ్ లతో, పంచ్ లతో బ్రహ్మానందం లేని లోటును పూడుస్తున్నారు.
కాబట్టి బ్రహ్మానందం తెరమీద కనిపించడం తగ్గి ఆఫర్ల కోసం కష్టాలు పడుతున్నాడని ఫిలింనగర్ లో ప్రచారం జరుగుతోంది.2014లో 19 సినిమాల్లో చేస్తే.. 2015లో 10 సినిమాల్లోనే బ్రహ్మానందం కనిపించాడు. ఇక 2016లో వస్తున్న భారీ సినిమాల్లో బ్రహ్మానందం లేడు. సోగ్గాడే చిన్న నాయనలో మాత్రం కనిపించనున్నాడు. తర్వాత ఎలుకా మజాకా అనే సినిమా కూడా ఉంది. ఈ రెండు కూడా ఎప్పుడో ఒప్పుకున్న సినిమాలు. కొత్త ఏడాదిలో ఒక్క కొత్త సినిమా కూడా సంతకం చేసినట్టు కనిపించడం లేదు.
బ్రహ్మానందం కోవై సరళ బంధం
బ్రహ్మానందం – కోవై సరళ ఎన్నో సినిమాల్లో కలిసి నటించారు. ఎక్కువగా భార్యాభర్తలుగా కూడా నటించారు. ఒకానొక సమయంలో ఏ సినిమాలో బ్రహ్మానందంకి పెయిర్ కావాలన్నా కోవై సరళనే తీసుకొచ్చేవాళ్ళు. వాళ్ళిద్దరి పెయిర్ సూపర్ హిట్. ఆ పెయిర్ కి అభిమానులు కూడా ఉన్నారు. ఒకానొక సమయంలో సినిమాల గురించి అవగాహన లేని వాళ్ళైతే వాళ్ళు నిజంగానే భార్యాభర్తలేమో అనుకునేవారు.
అంతలా బ్రహ్మానందం – కోవై సరళ తమ నటనతో ప్రేక్షకులని మెప్పించారు.కోవై సరళ మాట్లాడుతూ.. బ్రహ్మానందం గారు నాకు అన్న, తండ్రిలా సలహాలిచ్చేవారు. ఆయనతో కలిసి చాలా సినిమాలు చేశాను. ఆయన నాతో ఎప్పుడైనా మాట్లాడితే.. సరళా చెల్లి ఏం చేస్తున్నావు, డబ్బులు దాచుకో, అవసరానికి పనికొస్తాయి. నీకు ఎప్పుడు ఏ అవకాశం వచ్చినా నేనుంటాను అంటారు. ఆయన అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం అని తెలిపింది.దీంతో కోవై సరళ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
కమల్ హాసన్ వాయిస్
కమల్‌హాసన్‌లా మాట్లాడిన బ్రహ్మానందం వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. “భారతీయుడు మొదటి భాగాన్ని హిట్ చేశారు. ఇప్పుడు రెండో పార్ట్‌తో సిద్ధమయ్యాను. ఈ సినిమా కోసం ఎక్కువ కష్టపడ్డాను. దక్షిణాది ప్రేక్షకులు నన్నెంతో ఆదరిస్తున్నారు. నాకు సంతోషంతో మాటలు రావడం లేదు. ఈ సినిమాను మీరంతా ఆదరిస్తే ఇంకాస్త సంతోషిస్తా. మీ కమల్ హాసన్” అని బ్రహ్మీ ఆయనలా మాట్లాడారు. ఈ స్పీచ్‌ను కమల్ కూడా ఎంజాయ్ చేయడం వీడియోలో కనిపించింది. ఇక కాలేజీలో చదువుకునే రోజుల్లో అందరూ ఎన్టీఆర్, ఏఎన్ఆర్లను ఇమిటేట్ చేస్తే తాను మాత్రం కమల్ వాయిస్‌ను మిమిక్రీ చేసేవాడినని అన్నారు.